Breaking Newsక్రైంజాతీయంతెలంగాణనల్గొండ

Check Post : వాడపల్లి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన అంతర్ రాష్ట్ర, సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు..!

Check Post : వాడపల్లి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన అంతర్ రాష్ట్ర, సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు..!

ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మధ్యం, నగదు సరఫరా కాకుండా పటిష్ఠ నిఘా

నల్లగొండ, మనసాక్షి :

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర, సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత ఇతర అధికారులతో వాడపల్లి ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ కాన్ఫిరెన్స్ హల్ నందు పరస్పర సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.

ఈ సమావేశం నందు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంతరాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఇరు రాష్ట్రాల పరస్పర సమాచారం పంచుకోవడం ద్వారా కట్టడి చేసేందుకు వీలు ఉంటుందని అన్నారు.

 

దీనికోసం సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉంచడం, సరిహద్దు అధికారులు ఒకరికొకరు పరస్పరం సమచారాన్ని చేరవేసుకుంటూ ముందుకు సాగాలని ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ననుసరించి నల్గొండ జిల్లాలో వాడ పల్లి సమీకృత చెక్ పోస్ట్, నాగార్జున సాగర్ సమీకృత చెక్ పోస్ట్,సాగర్ టెయిల్ పాండ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు, నగదు మద్యం పంపిణీ పై పటిష్ట నిఘా ఉంచినట్లు, సరిహద్దు జిల్లా అధికారులు కూడా చెక్ పోస్ట్ ల నగదు మద్యం సరఫరా కాకుండా నిఘా ఉంచాలని, సమాచారం అందితే వెంటనే తెలియ చేయాలని అన్నారు.

అనంతరం వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన సమీకృత చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్,ఎస్.పి తనిఖీ చేశారు.
ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మధ్యం,నగదు సరఫరా కాకుండా పటిష్ఠ నిఘా పెడుతూ తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి.లు ఆయా శాఖల అధికారులు,సిబ్బందికి సూచించారు.

ALSO READ : 

Corruption of VBKs : సంఘ బంధాలలో విబికెల అవినీతి.. విచారణ జరపాలని సభ్యుల డిమాండ్..!

Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!

Devarakonda : పాదచారుల పైకి దూసుకెళ్లిన కారు ఒకరి మృతి..!

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు