Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే అమలు చేయాలని ప్రారంభించింది.

వందరోజుల కాంగ్రెస్ పార్టీ పాలన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పథకం పట్ల కీలకమైన ప్రకటన చేశారు. రైతుబంధు తొలగించి ఆ పథకం మాదిరిగానే రైతు భరోసాను రాబోయే వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పథకం ద్వారా రైతుల పెట్టుబడి సహాయంగా ఎకరానికి 15 వేల రూపాయలను అందించనున్నట్లు తెలిపారు.

రైతు భరోసా పథకాన్ని వానకాలం సీజన్ లో ప్రారంభించి ప్రతి వానాకాలం సీజన్లో 7500, సీజన్ లో 7500 ప్రతి ఎకరానికి రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఈ పథకంలో కీలకమైన అంశం ఏంటంటే గతంలో రైతు బంధు పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, గృహ నిర్మాణాలు చేసుకున్న భూమికి , సాగుకు పనికిరాని భూమికి, లేఅవుట్లుగా మార్చిన భూమికి సైతం రైతుబంధు రూపంలో నిధులు వృధా అయ్యాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం కింద సాగు చేసే రైతులకు సాగు భూమికి మాత్రమే రైతు భరోసా అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 68 లక్షల మంది రైతులు ఈ పథకం కింద అర్హులుగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సాగు చేస్తున్న భూమి సర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులను గుర్తించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

పెళ్లయిన ఏడాదిలోపే.. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతుండగా..!

BREAKING : అందుకోసమే వారిద్దరూ ఒకటయ్యారు.. పోలీసులకు చిక్కారు..!

మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

మరిన్ని వార్తలు