పెళ్లయిన ఏడాదిలోపే.. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతుండగా..!

అల్లరు ముద్దుగా కళ్ళముందే నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. మృత్యు రూపంలో వారు వెళ్ళిపోతే ఊహించని బాధ మిగులుతుంది. పెళ్లయిన ఏడాదిలోపే అల్లారుముద్దుగా ఉంటున్నారు ఆ జంట. ఊహించని రీతిలో ఆమెను బలి తీసుకుంది. అకాల మృత్యువు కబలించిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పెళ్లయిన ఏడాదిలోపే.. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతుండగా..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

అల్లరు ముద్దుగా కళ్ళముందే నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. మృత్యు రూపంలో వారు వెళ్ళిపోతే ఊహించని బాధ మిగులుతుంది. పెళ్లయిన ఏడాదిలోపే అల్లారుముద్దుగా ఉంటున్నారు ఆ జంట. ఊహించని రీతిలో ఆమెను బలి తీసుకుంది. అకాల మృత్యువు కబలించిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. కొత్తకోట వీవర్స్ కాలనీ కి చెందిన యాదగిరి కి చిన్నచింతకుంటలో పోతు గౌతమికి గత ఏడాదికితం పెళ్లయింది. కొత్తగా కాపురం హాయిగా సాగిపోతుంది. ఆదివారం గౌతమి పుట్టింటికి వెళ్ళింది. అక్కడి నుంచి కురుమూర్తి అనే గ్రామానికి వెళ్లి అక్కడ బంధువులతో కొంతసేపు కలిసి ఉంది. అందరితో సరదాగా గడిపింది. ఆ తర్వాత సోమవారం రాత్రి 10 గంటలకు అత్తారింటికి బయలుదేరింది. తన భర్తతో కలిసి బైక్ మీద ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి 10 అవుతుంది ఇంటికి పోవాలన్న తొందరలో ఉన్నారు.

ALSO READ : ACB : ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..!

మదనాపురం మండలంలోని దంతనూరు సమీపంలోకి రాగానే అక్కడ గాలికి గౌతమి చున్నీ ఒక్కసారిగా ఎగిరి బైక్ వెనుక చక్రాల్లో ఇరుక్కుంది. ఆ విషయాన్ని ఇద్దరు కూడా గమనించలేదు. గౌతమి చున్నీ మెడకు వేసుకోవడంతో ఒక్కసారిగా ఆమె రోడ్డుపై పడిపోయింది.

ఆ తర్వాత వెంటనే గమనించిన భర్త యాదగిరి బైక్ ఆపి గౌతమిని లేపి చూడగా అప్పటికే తలకు గాయమై రక్తమోడుతుంది. సమీపంలోని కొత్తకోట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గౌతమి మరణించింది.

పెళ్లయిన ఏడాదికే గౌతమి ని చున్నీ రూపంలో మృత్యువు కవలించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాహనంపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.

ALAO READ : Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!