ACB : ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..!

ఏసీబీ అధికారుల గాలానికి అవినీతి తిమింగలం దొరికింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడ పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక విభాగం అధికారులు తాసిల్దార్ రజిని నివాసంలో సోదాలు నిర్వహించారు. హనుమకొండలోని కె ఎల్ ఎస్ రెడ్డి కాలనీలో నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ACB : ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ఏసీబీ అధికారుల గాలానికి అవినీతి తిమింగలం దొరికింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడ పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక విభాగం అధికారులు తాసిల్దార్ రజిని నివాసంలో సోదాలు నిర్వహించారు. హనుమకొండలోని కె ఎల్ ఎస్ రెడ్డి కాలనీలో నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఆమెతోపాటు ఆమె బంధువుల నివాసంలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో ఏసీబీ అధికారులకు భూములకు సంబంధించిన విలువైన పత్రాలు లభ్యమైనట్లు తెలిసింది. ఏక కాలంలో ఐదు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించగా 55.22 లక్షల విలువైన ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, 21.17 లక్షల విలువైన 22 ఓపెన్ ప్లాట్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

తాసిల్దార్ రజిని ఆమె కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేసిన 50 లక్షల విలువైన భూమి డాకుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెటు విలువ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. సోదరులలో 1462 గ్రాముల బంగారు ఆభరణాలు 9.39 విలువచేసే గృహపకరణాలు. 31.06 లక్షల విలువైన వాహనాలను గుర్తించారు.

మొత్తం 3.20 కోట్ల ఆస్తుల విలువ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ 12 కోట్లకు పైగానే ఉండొచ్చు అని అధికారులు పేర్కొంటున్నారు. తాహసిల్దార్ రజిని పై ఓ బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తుంది . ఈ కేసులో ఆమెకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

ALSO READ : Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!