Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో విలేకరులు బ్లాక్మెయిల్ చేశారని నిర్ధారణ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

మృతుడు నీరటి రవి, భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

పరారీలో ఉన్న, మరో ముగ్గురు రిపోర్టర్స్, గాలింపు చర్యల్లో ప్రత్యేక పోలీసు బృందాలు.

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: (మన సాక్షి):

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధి టంగటూరు గ్రామానికి చెందిన నీరటి రవి అనే వ్యక్తి, జిఎస్ఎన్ మనీ సర్కులేషన్ స్కీం లో, తీవ్రంగా నష్టపోయి, పెట్టుబడిదారుల ఒత్తిడికి తాళలేక, ఫిబ్రవరి 3న తన ముగ్గురు కుమారులకు ఉరివేసి, తాను కూడా ఉరివేసుకొని, ఆత్మహత్య చేసుకున్న సంఘటన, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నార్సింగి పోలీస్ స్టేషన్లో ఏసీపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి చింతమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ

ఈ కేసులో మృతుడు నీరటి రవిభార్య, నీరట శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఒకే కుటుంబానికి చెందిన, నలుగురి ఆత్మహత్యలకు, తక్షణ కారణంగా, శంకర్‌పల్లి మండలానికి చెందిన పాత్రికేయులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మంగలి శ్రీనివాస్, ఈనాడు కురుమ శ్రీనివాస్, నమస్తే తెలంగాణ వడ్డే మహేష్, సాక్షి సానికే ప్రవీణ్, వార్త సిరిపురం శ్రీనివాస్ రెడ్డి మరియు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు లుగా గుర్తించారు. సాక్షి విలేఖరి, ప్రవీణ్, వార్తా విలేఖరి శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకోగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి శ్రీను, ఈనాడు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ మహేష్ లు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

మృతుడు నీరటి రవి భార్య, నీరట శ్రీలత పోలీసులకు తెలియజేసిన వివరాల ప్రకారం, నీరటి రవి 2022 వ సంవత్సరంలో పనిచేసే సమయంలో, రవి ఆ యొక్క కంపెనీ పని నిమిత్తం గుంటూరు కు వెళ్లగా అక్కడ రవికి తిరుపతిరావు అనే వ్యక్తి పరిచయం అయ్యి, జిఎస్ఎన్ ఫౌండేషన్ మనీ సర్కులేషన్, విజయనగరానికి సంబంధించిన దాని గురించి వివరించి మెంబర్గా చేర్పించాడు. ఈ స్కీములో రెండు వేల రూపాయలు కడితే, 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు పూర్తిగా ఇచ్చి, ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున ఆరు నెలల వరకు ఇచ్చేవారు.

ఇదే స్కీం నీరటి రవి, తన బంధుమిత్రులకు , తన గ్రామస్తులకు ఇరుగుపొరుగు వారికి, వివరించి భారీగా పెట్టుబడులు పెట్టించాడు. కొంతకాలం వరకు ఈ వ్యాపారం బాగానే కొనసాగింది, అయితే కొన్ని నెలలుగా పట్టిన డబ్బు తిరిగి రాకపోవడంతో, పెట్టుబడిదారులు రవి పై తీవ్ర ఒత్తిడి చేశారు.

అందులో భాగంగా, ఈ విషయం తెలుసుకున్న శంకర్‌పల్లి పాత్రికేయులు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి శ్రీను, ఈనాడు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ మహేష్, సాక్షి ప్రవీణ్, వార్త శ్రీనివాస్ రెడ్డి లు శంకర్‌పల్లి లోని బీడీఎల్ చౌరస్తా వద్ద ఓ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసి, నీవు జిఎస్ఎన్ ఫౌండేషన్ కు డబ్బులు కట్టించుకొని, తిరిగి ఇవ్వడం లేదని, నీ మీద కంప్లైంట్స్ ఉన్నాయని, నీవు ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఎస్ఎంయు ఫంక్షన్ హాల్ కట్టామని, బెదిరించి 20 లక్షలు డిమాండ్ చేశారు, రవి వాళ్ళ కాల వేలపడి, 10 లక్షలకు ఒప్పుకొని, తన భార్య పుస్తెలతాడు అమ్మి, రెండు లక్షల 50 వేలు ఆ పాత్రికేయులకు ఇచ్చాడు.

అదేవిధంగా హైదరాబాదులోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నాగరాజు అనే హెడ్ కానిస్టేబుల్, నీరటి రవి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి, డబ్బులు రాకపోయేసరికి బెదిరించి, అతని పేరు మీద ఉన్న భూమి కాగితాలు, ఒకచోట కుదువ పెట్టించి, 20 లక్షల రూపాయలు తీసుకొని అతనికి జీవన ఆధారం లేకుండా చేయడంతో, తీవ్ర నిరాశలో నిస్సహాయ స్థితి లో, తన ముగ్గురి పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకున్నాడని ఇన్వెస్టిగేషన్లో తేలింది.

పరారీలో ఉన్న మరో ముగ్గురిని, త్వరలోనే పట్టుకుంటామని, హోంగార్డు నాగరాజు విషయంలో స్పష్టమైన ఆధారాలు స్వీకరించి, అరెస్టు చేస్తామని తెలియజేశారు. జిఎస్ఎన్ ఫౌండేషన్ మీద కూడా ప్రత్యేక బలగాలు విచారణ చేపడుతున్నాయని, త్వరలో అన్ని విషయాలు బయటపెడతామని తెలియజేశారు. కార్యక్రమంలో నార్సింగి ఏసిపి వెంకటరమణ గౌడ్, మోకిల సిఐ వీరబాబు గౌడ్, ఎస్సై కోటేశ్వరరావు ఉన్నారు.