Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsviralజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవరంగల్ గ్రామీణ జిల్లా

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

పార్టీ మారుతావా అంటూ.. బీఆర్ఎస్ నాయకుడిని ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే … నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే గత ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ మోహన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. దాంతో మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్టీ మారుతావా అంటూ.. జిల్లా కార్యదర్శి బండారు మంజుల ఆయనని చెప్పుతో కొట్టింది.

ఇదిలా ఉండగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మోహన్ రెడ్డి బంధువు. ఎమ్మెల్యే బంధువు పీ ఎ ఎస్ఎస్ చైర్మన్ ను ఓ మహిళ చెప్పుతో కొట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితున్నాయి. వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

ALSO READ : 

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

పెళ్లయిన ఏడాదిలోపే.. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతుండగా..!

మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!

 

 

మరిన్ని వార్తలు