మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!

వినియోగదారులు పెద్దపెద్ద మార్ట్, సూపర్ మార్కెట్లకు వెళ్లి ఎక్స్ పైరీ డేట్ చూసుకోకుండానే వస్తువులు, తినుబండారాలు కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. పెద్ద మార్ట్ లలో ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయని భావిస్తారు.

మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!

మిర్యాలగూడ , మన సాక్షి :

వినియోగదారులు పెద్దపెద్ద మార్ట్, సూపర్ మార్కెట్లకు వెళ్లి ఎక్స్ పైరీ డేట్ చూసుకోకుండానే వస్తువులు, తినుబండారాలు కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. పెద్ద మార్ట్ లలో ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయని భావిస్తారు. కానీ మిర్యాలగూడలో మాత్రం ఓ మార్ట్ లో కాలం చెల్లినవి విక్రయిస్తున్న సంఘటన పదేపదే జరుగుతుంది.

వివరాల ప్రకారం… నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డు లో ఉన్న బ్లూ వెల్ ప్యాలెస్ వెనుక వైపు ఉన్న ఓ పెద్ద మార్ట్ లో కాలం చెల్లిన బిస్కెట్లు విక్రయిస్తున్న వైనం బయటపడింది. వినియోగదారుడు కొనుగోలు చేసేందుకు వెళ్లి ఎక్స్ పైరీ డేట్ చూడగా అవి కాలం చెల్లాయి. ఈ విషయాన్ని ఆ మార్ట్ లో ఉన్న మేనేజర్ కు తెలియజేయగా కేవలం పొరపాటయిందని చెప్పి చేతులు దులుపుకున్నాడు.

ఇలాంటి సంఘటన గతంలో కూడా జరిగిన జరిగింది. అయినా కూడా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. దాంతో వినియోగదారుడు మార్ట్ కు సంబంధించిన జిల్లా మేనేజర్ కు ఫోన్లో కంప్లైంట్ చేశారు. దాంతో ఇక్కడి మార్ట్ మేనేజర్ పొరపాటు జరిగిందని ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది.

కాలం చెల్లిన బిస్కెట్లు తింటే ప్రమాదం :

కాలం చెల్లిన బిస్కెట్లు, బ్రెడ్ తిన్నవారికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఇకపై వినియోగదారులు పెద్ద మార్ట్ లో కొనుగోలు చేసినప్పటికీ ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా చూసుకోవాలని వినియోగదారులు పేర్కొంటున్నారు.

MOST READ : 

Telangana : ఇందిరమ్మ ఇళ్ల పథకంకు వారే అర్హులు.. ఎంపిక విధానం ఇలా..!

New House : 50 గజాల స్థలంలో ఇల్లు, రూ.6.50 లక్షలతో సిమెంటు రాళ్లు , ఇసుక లేకుండా నిర్మాణం..!

Telangana : తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి శుభవార్త.. మరో మూడు గ్యారెంటీల అమలు..!

Modi : నరేంద్ర మోడీ అందించే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎలా పొందవచ్చు..!