Modi : నరేంద్ర మోడీ అందించే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎలా పొందవచ్చు..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదలకు శుభవార్త తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఒక కోటి కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్ అందించే పథకాన్ని ఇటీవల ఆయన సూర్య ఘర్ ఫ్రీ బిజిలి యోజన పేరుతో ప్రారంభించారు.

Modi : నరేంద్ర మోడీ అందించే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎలా పొందవచ్చు..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదలకు శుభవార్త తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఒక కోటి కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్ అందించే పథకాన్ని ఇటీవల ఆయన సూర్య ఘర్ ఫ్రీ బిజిలి యోజన పేరుతో ప్రారంభించారు. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉంది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? విధి విధానాలు ఏమిటి..? అనే విషయం ఎవరికీ సరిగా తెలియదు.

కానీ దీనికి అర్హులుగా ఉన్నవారు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మీ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు వెళ్లాలి. పోస్ట్ ఆఫీస్ ద్వారా సూర్య ఘర్ ఫ్రీ బిజిలీ యోజన పథకం కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రస్తుతం కర్ణాటకలో ప్రారంభించారు.

కర్ణాటక పోస్ట్ సర్కిల్లోని పోస్టల్ ఉద్యోగులు ఇప్పటికే ప్రధానమంత్రి సూర్య ఘర్ ఫ్రీ బిజిలీ యోజన కింద రిజర్వేషన్లను ప్రారంభించారు. అయితే ఈ పథకం కు దరఖాస్తు చేసుకునేవారు గత ఆరు మాసాల విద్యుత్ బిల్లులు చెల్లించి ఉండాలి. అప్పుడే ఈ ప్రయోజనం అందుకుంటారు. దేశవ్యాప్తంగా ఒక కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం.

ఈ పథకం కింద వినియోగదారులకు మూడు కిలోవాట్ల వరకు కిలోవాట్ కు 30,000 రూపాయలు, మూడు కిలోవాట్ల కంటే ఎక్కువ కనెక్షన్లకు కిలోవాటుకు 18 వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తారు. దీనిని వినియోగదారుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తారు.

ALSO READ : Nalgonda : నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి..!