Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Nalgonda : నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి..!

Nalgonda : నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీ కుందూరు రఘువీర్ రెడ్డి పేరును ప్రకటించింది. ఏఐసీసీ అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 36 మంది పేర్లను తొలి జాబితాలో ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురి పేర్లు ఉండగా వారిలో రఘువీర్ రెడ్డి పేరు కూడా ఉంది. జానారెడ్డి మొదటి తనయుడు రఘువీర్ రెడ్డి. నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం రఘువీర్ రెడ్డి ప్రయత్నాలు జరిపారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా జానారెడ్డి రెండవ తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి ఉన్నారు. నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డికి నిరాశే మిగిలింది.

ALSO READ : BREAKING : పండుగ రోజు విషాదం.. టిప్పర్ ఢీకొని తండ్రి కొడుకుల మృతి..!

శాసనసభ ఎన్నికల సమయంలోనే ఆయన మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వడం కుదరని కారణంగా రఘువీర్ రెడ్డిని పక్కన పెట్టి మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి కి టికెట్ ఇచ్చారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి పక్కకు తప్పుకోవడం తో ఆయన రెండో తనయుడు కుందూరు జై వీర్ రెడ్డి కి టికెట్ కేటాయించగా, ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా, రఘువీర్ రెడ్డికి ఎంపీ టికెట్ హామీ ఇవ్వడం ద్వారానే ఎమ్మెల్యే టికెట్ రేసు నుంచి పక్కకు తప్పించారన్న అభిప్రాయం కూడా ఉంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఊపు మీదున్న సమయంలో వస్తున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు సునాయాసం అవుతుందన్న విశ్వాసంతో ఎంపీ టికెట్ కోసం పోటీ పెరిగిందంటున్నారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు కాంగ్రెస్ చేతిలో ఉండగా, ఒక్క సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన అన్ని సెగ్మెంట్లలో శాసనసభ ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజార్టీ సాధించారు. స్వల్ప కాల తేడాతో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇది విజయానికి దోహదపడుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కుందూరు రఘువీర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి టికెట్ కేటాయించడంతో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి ఖరారు చేసిన తర్వాత ఉత్కంఠకు తెరపడినది.

ALSO READ : Congress First List : కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..!

నల్లగొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గా కుందూరు రఘువీర్ రెడ్డి :

కుందూరు రఘువీర్ రెడ్డి s/o జానారెడ్డి
వయస్సు :- 44 (2-01-1980)
విద్యార్హత :- డిగ్రీ వృత్తి :- వ్యాపారం
భార్య పేరు :- లక్ష్మి, ఇద్దరు పిల్లలు 1)ఈశాన్వి 2) గౌతమ్ రెడ్డి 2009లో యూత్ కాంగ్రెస్స్ స్టేట్ మెంబర్
2014లో pcc సభ్యుడు 2018 పిసిసి మెంబర్

మరిన్ని వార్తలు