Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

New House : 50 గజాల స్థలంలో ఇల్లు, రూ.6.50 లక్షలతో సిమెంటు రాళ్లు , ఇసుక లేకుండా నిర్మాణం..!

New House : 50 గజాల స్థలంలో ఇల్లు, రూ.6.50 లక్షలతో సిమెంటు రాళ్లు , ఇసుక లేకుండా నిర్మాణం..!

ఆసక్తిగా తిలకిస్తున్న మండల ప్రజలు

నేలకొండపల్లి, మన సాక్షి:

పునాది తీసేది లేదు… సిమెంట్, రాళ్లు, ఇసుక ఏది కలిపేది లేదు. అది కూడ అతి కొద్ది స్థలంలోనే ఇంటిని తీసుకొచ్చి పెడుతున్నారు. ఓ వెంచర్ లో చెక్కల ఇంటిని ఏర్పాటు చేయటంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారామ టౌన్షిప్ లో రియల్టర్లు తాజాగా చెక్కల ఇంటిని ఏర్పాటు చేశారు. 50 గజాల స్థలం లో చెక్కలతో ఓ అందమైన ఇంటిని ఏర్పాటు చేశారు. హైద్రాబాద్ లో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేశారు. బెడ్ రూమ్, సిట్ రూమ్, హాలు, ఆటా కలిగిన చెక్కల ఇంటిని హైద్రాబాద్ లో తయారు చేసిన ఇంటిని తీసుకొచ్చి ఇక్కడ పిట్ చేశారు.

వెంచర్ నిర్వహకులు రంగిశెట్వెంకటప్పయ్య, రావెళ్ల కృష్ణారావు, మేనేజర్ సురేష్నాయడు లు నేలకొండపల్లి లో చెక్కల ఇంటిని ఏర్పాటు చేశారు. దీని విలువ దాదాపు రూ.6.50 లక్షల వరకు ఖర్చు వచ్చిందని యాజమానులు తెలిపారు. కాగా అందమైన చెక్కల ఇంటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఒకప్పుడు పట్టణం కే పరిమితమైన చెక్కల ఇల్లు నేలకొండపల్లి రావటంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ALSO READ : BRS, BSP : తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై మాయావతి సంచలన ప్రకటన.. ఆర్ఎస్పి ట్వీట్..!

మరిన్ని వార్తలు