Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసంక్షేమంహైదరాబాద్

Telangana : తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి శుభవార్త.. మరో మూడు గ్యారెంటీల అమలు..!

Telangana : తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి శుభవార్త.. మరో మూడు గ్యారెంటీల అమలు..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో శుభవార్త తెలియజేశారు. ఇప్పటికే మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. మరో రెండు రోజుల్లో మరో మూడు గ్యారెంటీ హామీలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

మహిళ సంఘాలకు జీరో వడ్డీ రుణాలను అందించే పథకాన్ని ఈనెల 12వ తేదీన పరేడు గ్రౌండ్ మహిళల బహిరంగ సభలో ప్రకటించనున్నారు. గత ప్రభుత్వం మహిళలకు, మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు అందిస్తున్నామని చెప్పినప్పటికీ మహిళా సంఘాలు చెల్లించిన వడ్డీని బ్యాంకులకు జమ చేయకుండా పావలా వడ్డీని కూడా చెల్లించలేదు. దాంతో మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కాగా రేవంత్ సర్కార్ వడ్డీ లేని రుణాలను అందించే పథకాన్ని ప్రారంభించనున్నారు.

అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు రఘ.2500 ఇచ్చే పథకాన్ని కూడా ఈ నెల 12వ తేదీన క్యాబినెట్ లో చర్చించి ప్రకటించనున్నారు. ఈ పథకానికి ప్రజా పాలన దరఖాస్తులో దరఖాస్తులు స్వీకరించారు. కాగా క్యాబినెట్ సమావేశంలో విధి విధానాలపై చర్చించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో మరో హామీని కూడా ప్రకటించనున్నారు. కల్యాణ లక్ష్మి పథకం కింద గత ప్రభుత్వం లక్ష రూపాయలు ఇవ్వగా రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్ల పెళ్లి కి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఉచితంగా అందజేయనున్నారు. కాగా ఈ పథకాన్ని పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రకటించనున్నారు.

100 రోజులలో ఆరు గ్యారంటీ హామీలను అమలు చేస్తామని మాట ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కృషి చేస్తుంది. మరో వారం రోజుల్లో లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున.. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే హామీలను అమలు చేయడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నం చేస్తుంది.

హామీలన్నీ లోకసభ ఎన్నికలలోపే అమలు చేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ తోపాటు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని రాజకీయ పరిశీలన పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు