BREAKING : అందుకోసమే వారిద్దరూ ఒకటయ్యారు.. పోలీసులకు చిక్కారు..!

వారిద్దరివి వేరు వేరు కాపురాలు.. ఒకరు భర్తను విడిచిపెట్టారు. మరొకరు భార్యను విడిచిపెట్టారు. వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. వారికి సంపాదన తక్కువైంది. జల్సాలు ఎక్కువయ్యాయి. దాంతో ఆ జంట దోపిడీలకు పాల్పడుతుంది.

BREAKING : అందుకోసమే వారిద్దరూ ఒకటయ్యారు.. పోలీసులకు చిక్కారు..!

నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి వెల్లడి

నల్లగొండ, మనసాక్షి :

వారిద్దరివి వేరు వేరు కాపురాలు.. ఒకరు భర్తను విడిచిపెట్టారు. మరొకరు భార్యను విడిచిపెట్టారు. వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. వారికి సంపాదన తక్కువైంది. జల్సాలు ఎక్కువయ్యాయి. దాంతో ఆ జంట దోపిడీలకు పాల్పడుతుంది. దోపిడీలకు పాల్పడుతున్న జంటను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నల్లగొండ డిఎస్పి శివరామిరెడ్డి విలేకరులకు వివరాలను వెల్లడించారు.

కష్టపడి సంపాదించిన ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో జల్సా లకు అలవాటు పడిన భార్యాభర్తలు దోపిడీలు దొంగతనాలకు పాల్పడుతుండడంతో గురువారం వారిని అరెస్టు చేసినట్లు నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు.

గురువారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన చెమట గోపికృష్ణ భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటుండగా అదే పట్టణానికి చెందిన చింతల మహేశ్వరి భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలతో జీవిస్తుంది. ఈ క్రమంలో గోపికృష్ణకు మహేశ్వరి పరిచయమై ఇద్దరు తిరుపతిలో పెళ్లి చేసుకుని సహజీవనం చేస్తున్నారని అయితే గోపికృష్ణ కారు నడుపుతూ ఉండగా మహేశ్వరి కూలి పనులు చేస్తూ జీవించేవారు .

ALSO READ : Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!

వారి ఆదాయం కుటుంబ అవసరాలకు కూడా సరిపోక పోవడంతో దోపిడీలకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గోపికృష్ణ తన కారులో బాడుగకు మాట్లాడుకున్న వ్యక్తులను గమ్యస్థానానికి తీసుకు వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో కారును ఆపి కారులో ఉన్న వారిని కత్తులతో బెదిరించి వారి దగ్గర ఉన్న బంగారు నగలు నగదు దోచుకునే వారని తెలిపారు.

ఈ క్రమంలోనే ఈనెల 10వ తేదీన బూరుగుపాడు గ్రామానికి చెందిన దుగ్గి కృష్ణారావు హైదరాబాదులోనివసిస్తున్నాడు తన బంధువు ఒకరు పిడుగురాళ్లలో చనిపోగ అక్కడికి వెళ్లి తిరుగుప్రయనంలో రాత్రి పిడుగురాళ్ల లో గోపికృష్ణ కారును అద్దెకు మాట్లాడుకొని హైదరాబాద్ వెళుతుండగా మార్గమధ్యంలో నల్లగొండ చేరుకోగానే దారి మార్చి దేవరకొండ రోడ్ లో వెళ్తూ కొత్తపెళ్లి గ్రామ శివారులో కారును ఆపి రెండు కత్తులు చూపి కారులో ఉన్న వ్యక్తిని బెదిరించి అతని మెడలో ఉన్న 15 గ్రాముల బంగారు చైను దోచుకున్నారని డిఎస్పి తెలిపారు.

ALSO READ : BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

బాధితుడు ఆరోజు అర్ధరాత్రి కావడంతో భయపడి నేరుగా ఇంటికి వెళ్లి మరుసటి రోజు అనగా ఈ నెల 12న నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై శివకుమార్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తిరుమలేష్ అట్టికారును మాడుగులపల్లి టోల్గేట్ వద్ద గుర్తించి నేరస్తుని ఈనెల 13న మర్రిగూడ బైపాస్ వద్ద పట్టుకొని వారి వద్ద నుండి నక్లెస్ ను రెండు కత్తులను రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరితగచ్చిన చేదించిన రూరల్ ఎస్సైని వారి సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.

ALSO READ : Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!