Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. మార్చి 1వ తేదీ నుంచి గృహజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. మార్చి 1వ తేదీ నుంచి గృహజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించిన వారికి జీరో బిల్లులు అందజేస్తున్నారు. 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించినప్పటికీ కూడా చాలామందికి జీరో బిల్లు రావడం లేదు.

రేషన్ కార్డులు, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ నెంబర్లలో తప్పులు ఉండటం.. డేటా ఎంట్రీలో తప్పులు కారణంగా జీరో బిల్లులు రాలేదని సమాచారం. అలాంటివారు సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల వద్ద దరఖాస్తులు అందజేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ జీరో కరెంటు బిల్లుల కోసం భారీగా క్యూలు నిలబడి అందజేస్తున్నారు.

ALSO READ : DSC : డీఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత శిక్షణ, హాస్టల్ సౌకర్యం.. ధరఖాస్తు ఇలా చేయండి..!

అయినా కూడా అక్కడ కూడా ఆ సమస్య తీరడం లేదు. ఎంపీడీవో , మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా పాలన దరఖాస్తు కరెంటు బిల్లులు అందజేసినప్పటికీ కూడా విద్యుత్ కార్యాలయంలో నమోదు కాలేదు అంటూ లబ్ధిదారులను వెనకకు పంపుతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్నాయి.

దాంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే జీరో బిల్లు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా జీరో బిల్లు రాకపోవడంతో బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. జీరో కరెంటు బిల్లు స్కీములో తమను చేర్చాలని ప్రభుత్వ కార్యాలయాలతో పరుగులు తీస్తున్నారు.

గృహజ్యోతి పథకంలో అర్హులుగా ఉన్నప్పటికీ జీరో విద్యుత్ బిల్లులు రావడం లేదు. డాటా ఎంట్రీ లో పొరపాటు కారణంగా సమాచార ధ్రువీకరణ తప్పులు ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అర్హులుగా ఉన్నప్పటికీ తమకు జీరో బిల్లు రాలేదని ఆందోళన చెందుతున్నారు.

జీరో బిల్లులు రాకపోయినప్పటికీ కూడా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొంటున్నారు. టెక్నికల్ సమస్యతో బిల్లు వస్తే భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

ALSO READ : 

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!