Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Corruption of VBKs : సంఘ బంధాలలో విబికెల అవినీతి.. విచారణ జరపాలని సభ్యుల డిమాండ్..!

Corruption of VBKs : సంఘ బంధాలలో విబికెల అవినీతి.. విచారణ జరపాలని సభ్యుల డిమాండ్..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్)మండలం పాతర్లపాడు గ్రామంలో సంఘ బంధాలలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని పాతర్లపాడు సంఘ బంధం సభ్యులు పులి వినోద, బోలక పద్మ, భీమ గాని రాధమ్మ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావుకు వినతి పత్రం అందించారు.

 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాతర్ల పాడు గ్రామంలో విలేజ్ బుక్ కీపర్ (వి బి కే)లు గుంటూరు తిరుమలమ్మ, మద్దికుంట్ల రాధ, కొప్పుల మానసలు సంఘ బంధంలో విబికేలుగా పని చేస్తున్నారని గత10 సంవత్సరాల నుంచి వారు చెప్పిందే వేదంగా పనిచేస్తూ అమాయకులైన చదువురాని సంఘబంద సభ్యుల వద్ద బుక్కులు దగ్గర పెట్టుకొని వారి చేత సంతకాలు పెట్టించుకుంటున్నారని, పొదుపు తీసుకున్నారంటే పర్సంటేజ్ ల రూపంలో వాళ్లకు ఇవ్వాల్సిందే లేదంటే లోన్లు ఇవ్వమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా వీళ్ళు వీబికేలుగా కొనసాగుతున్నారని, గ్రామంలో ఎంతోమంది కంప్యూటర్ నాలెడ్జి ఉన్న అర్హత కలిగిన వాళ్లు ఉన్నారని వీళ్ళనే ఎందుకు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రెండు సంవత్సరాలకోసారి నూతన బాడిని ఎన్నుకోవాలి నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ,కార్యదర్శి ,వి బి కే లను అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించి వెంటనే నూతన బాడిన ఏర్పాటు చేయాలని అన్నారు. తాళ్ల సింగారం గ్రామంలో ఎస్ బి ఐ శాఖ వారిలో దాదాపు మూడు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని వార్తాపత్రికల్లో వచ్చాయని అన్నారు.మా గ్రామ సమభావన సంఘాలలో పొదుపు చేస్తున్న మహిళ సంఘాలు 77 ఉన్నాయి.

 

ఇవి అన్ని కలిసి 3 సంఘ బంధాలుగా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారని తెలిపారు. ఎస్బిఐ అకౌంట్ లో లక్ష రూపాయలు జమైనాయి అందులో నుండి మా గ్రూప్ అధ్యక్షురాలు అకౌంట్ కు 49000 వేలు జమ అయినట్టు వచ్చినవని, మిగతా రూపాయలు ఎవరు కూడా జమ కాలేదు.

 

లక్ష రూపాయలు సంఘ బంధం వి బి కే గుంటూరు తిరుమలమ్మ మమ్మల్ని, బ్యాంకు వారిని మోసం చేసి ఆ రూపాయలను డ్రా చేసుకొని స్వప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ ను సంప్రదించగా వి బి కే మీకు తెలియకుండా తీసుకున్నదని తేల్చి చెప్పగా మేము వీబికేను నిలదీయడంతో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టినానా దుర్భాషలాడిందని తెలిపారు. ఈ ముగ్గురు వి బికే లు చేస్తున్న అవినీతిపై జిల్లా ఉన్నతాధికారి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాద గాని శోభ, పబ్బతి గంగమ్మ ,యమ గాని లక్ష్మి, గుంటూరు లలిత గంగపురి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Telangana : రుణమాఫీ హామీపై నాడు, నేడు అంటూ కేటీఆర్ ట్వీట్..!

మరిన్ని వార్తలు