Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
సినిమాBreaking Newsజాతీయంహైదరాబాద్

Ravitheja : రవితేజ ఇక ఆర్పిఎఫ్ అధికారి..?

Ravitheja : రవితేజ ఇక ఆర్పిఎఫ్ అధికారి..?

మన సాక్షి :

సినీ హీరో రవితేజ ఆర్ పి ఎఫ్ అధికారిగా మారబోతున్నారా..? అంటే అది నిజమే అని అనిపిస్తుంది. రవితేజ కథానాయకుడిగా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక సరికొత్త పాత్రలో రవితేజ రాబోతున్నాడు.

భాను బోగారపు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా ఇటీవల షూటింగ్ కూడా ప్రారంభమైంది. కాగా సినిమా సెట్స్ లో రవితేజకు ప్రమాదవశాత్తు గాయం కావడంతో షూటింగ్ తాత్కాలికంగా ఆగిన విషయం తెలిసిందే.

సినిమా సెట్స్ లో ప్రమాదం జరగడంతో కొంతకాలం విరామం తర్వాత మళ్లీ చిత్ర నిర్మాణం పున ప్రారంభించేందుకు బృందం సిద్దమవుతుంది. వచ్చేనెల మధ్య నుంచి ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కాగా రవితేజ ఈ సినిమాలో రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్ పి ఎఫ్) అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది ప్రధమార్ధంలో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు బీమ్స్ సిసి రోలియో సంగీతం, కార్తీక్ ఘట్టమనేని చాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు.

LATEST UPDATE : 

BREAKING : కోడి పందెం రాయుళ్ల అరెస్ట్..!

Miryalaguda : ఆకస్మికంగా హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. సిబ్బందిపై ఆగ్రహం..!

Nalgonda : మూసి ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు.. కాపాడిన పోలీసులు..!

District collector : ఓటరు ఇంటిని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..! 

మరిన్ని వార్తలు