తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో నేటి నుంచి ఈశ్వర బంధం ప్రారంభం.. అభివృద్ధిని ఎవ్వరు ఆపినా ఆగదు..!

Miryalaguda : మిర్యాలగూడలో నేటి నుంచి ఈశ్వర బంధం ప్రారంభం.. అభివృద్ధిని ఎవ్వరు ఆపినా ఆగదు..!

మిర్యాలగూడ. మన సాక్షి:

మిర్యాలగూడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద మూలమాలను వేసి నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

అనంతరం పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి కళాభారతి వరకు జాతీయ జెండాలు బతుకమ్మలు, బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , సబ్ కలెక్టర్ నారాయణ అమిత్,డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ప్రారంభించారు. అనంతరం కళాభారతి వద్ద అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణ సమస్యలపై వారి కార్యాచరణపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పవర్ ప్రజెంటేషన్ నిర్వహించారు.

అదే సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. దశాబ్ద కాలంగా మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి పేరుతో గత పాలకులు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలుఅస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు.నియోజకవర్గాన్ని గాడిన పెట్టి..అభివృద్ధి వైపు నడిపిస్తున్నామన్నారు.

ఈ క్రమంలో అభివృద్ధిని ఓర్వలేక. గతంలో జరిగిన అవినీతి వెలుగులోకి వస్తుండటంతో కొందరు జీర్ణించుకోలేక.. సోషల్ మీడియా కు ఎక్కి పనికిరాని రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలకు అతీతంగా మిర్యాలగూడ అభివృద్ధి కి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే గత కొద్ది సంవత్సరాలుగా బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినూత్న కార్యక్రమం ఈశ్వర బంధం కార్యక్రమం నేటి నుండి ప్రారంభిస్తునట్టు ప్రకటించారు. పత్యేక రాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మల్టీ పర్పస్ సిబ్బందికి ప్రతీ సంవత్సరం తన సొంత డబ్బుతో బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తానని వారికి చెక్కును అందజేశారు.

అదేవిధంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ కోసం నూతనంగా మంజూరైన 12 టాటా ఏసీ వాహనాలను, ఆరు ట్రాక్టర్లను మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు స్కైలాబ్ నాయక్, నూకల వేణుగోపాల్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, శాగ జలంధర్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, బలుగూరి శ్రీనివాస్, బంటు లక్ష్మీనారాయణ నియోజకవర్గ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు , ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్ సంస్థలు వ్యాపారస్థులు స్వచ్ఛంధ సంస్థల వారు, పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు,  పాల్గొన్నారు.

MOST READ :

  1. CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

  2. Nalgonda : జిల్లా అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  3. Mosquito : మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రమ్మన్నా రావు..!

  4. Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  6. Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు