Viral Video : అమెరికాలో పీఠం ఎక్కేది ఎవరో తేలిపోయింది.. హిప్పో జోస్యం.. (వీడియో వైరల్)
Viral Video : అమెరికాలో పీఠం ఎక్కేది ఎవరో తేలిపోయింది.. హిప్పో జోస్యం.. (వీడియో వైరల్)
మన సాక్షి, వెబ్ డెస్క్:
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. రిపబ్లిక్, డెమొక్రటిక్ ల మధ్య పోటా పోటీ యుద్ధం సాగుతోంది. డోనాల్డ్ ట్రంప్, కమలహారిస్ మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది.
ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం కూడా చేశారు. డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. కమలహారిస్ కు భారతీయ మూలాలు ఉన్నందున భారతీయులంతా ఆమెకు సపోర్ట్ చేస్తారని ఆమె వర్గీయులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇరువురి మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది.
ఇది ఇలా ఉండగా ఇరువురిలో ఎవరు గెలుస్తారనే విషయం హిప్పోపోటామస్ (నీటి గుర్రం) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని తేల్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికాలోని థాయ్ లాండ్ లో బుజ్జి పిగ్మీ హిప్పో అమెరికా పీఠం ఎవరు అధిరోహిస్తారో..? జోస్యం చెప్పేసింది. అయితే గతంలో పలు సందర్భాలలో కూడా హిప్పో చెప్పిన జోస్యం నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయట.
ఈ క్రమంలోనే అమెరికా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్, కమల హరీష్ వీరిలో ఎవరు గెలుస్తారో అని రెండు పుచ్చకాయ కేకులను వేరువేరుగా చేసి ఒక దానిపై డోనాల్డ్ ట్రంప్ మరో దానిపై కమల హారిస్ అని రాసి ఉంచారు.
అప్పుడు హిప్పో వచ్చి డోనాల్డ్ ట్రంప్ పేరు ఉన్న పుచ్చకాయ కేకును తినేసింది. దాంతో అమెరికా పీఠం ఎక్కేది డోనాల్డ్ ట్రంప్ అంటూ.. హిప్పో జోస్యం చెప్పిందని అక్కడివాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
VIDEO
Moo Deng, famous baby hippo, predicts Donald Trump will win the election. pic.twitter.com/UqUnRhU0Nr
— The Rabbit Hole (@TheRabbitHole) November 4, 2024
MOST READ :
-
Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!
-
Gold Price : పసిడి ప్రియుల్లో ఆనందం.. పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ధర..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు మార్గదర్శకాలు.. మీరు అర్హులేనా.. పంపిణీ ఎప్పటి నుంచంటే..!
-
Ration Cards : రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం భారీ శుభవార్త..!









