Miryalaguda : నకిలీ షూరిటీ లు కోర్టు లో పెట్టినందుకు జైలు శిక్ష, జరిమానా..!
Miryalaguda : నకిలీ షూరిటీ లు కోర్టు లో పెట్టినందుకు జైలు శిక్ష, జరిమానా..!
నల్లగొండ, మన సాక్షి
2008 సం. ము లో నల్గొండ 2 town పోలీస్ స్టేషన్ కు సంబందించిన కేసు లో నేరస్తుడు మహమ్మద్ జుబేర్ తండ్రి అంజాద్ నివాసము బంగారిగడ్డ మిర్యాలగూడ ను జైలు నుండి బెయిల్ మీద విడిపించుటకు గాను
1) పాలడుగు అంజయ్య తండ్రి చంద్రయ్య
2) పెదపంగా యేసు తండ్రి బిక్షం
3) పెద్దం చిన్న వెంకన్న @ ఎర్ర వెంకన్న(చనిపోయినాడు)
అందరిదీ ఇటిక్యాల, శెట్టిపాలెం గ్రామము అను వారు నకిలీ ధ్రువ పత్రాలను సృష్టించి శెట్టిపాలెం గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకము ఫార్జరీ చేసి కోర్ట్ లో దాఖలు చేసినారు. నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
అప్పటి జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రాజ గోపాల్ విచారణ జరిపించి నల్గొండ 1town పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా అప్పటి యస్ ఐ మజీద్ అలీ ఖాన్ కేసు నమోదుచేసి ముగ్గురు నేరస్థుల మీద ఛార్జ్ షీట్ వేసినారు.
కోర్ట్ లో విచారణ జరిపిన తరువాత నేరస్థులు ముగ్గురి మీద నేరము రుజువు అయినందున శ్రీమతి కె శిరీష గౌరవ ప్రిన్సిపాల్ JFCM నల్గొండ గారు 6 నెలల జైలు శిక్ష మరియు రు.4000/-లు జరిమాన విధించినారు. కేసు ను శ్రీ N కృష్ణయ్య APP గారు ప్రాసెక్యూషన్ తరుపున వాదించిగా, CDO రామకృష్ణ PC, లైసన్ ఆఫీసర్స్ HC P నరేందర్ మరియు PC N మల్లిఖార్జున్ లు సహకరించినారు.
MOST READ :
-
Nalgonda : సంచలనం కలిగించిన కలర్ ల్యాబ్ యజమాని హత్య కేసును చేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్..!
-
Leopard : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత.. ప్రాణాలతో కాపాడేందుకు అధికారుల ప్రయత్నం..!
-
Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!
-
Miryalaguda : రైతుపై దాడి చేసిన రైస్ మిల్లర్లు.. ఆసుపత్రిలో రైతును పరామర్శించిన ఎమ్మెల్యే..!
-
District collector : భూభారతి చట్టంపై 17 నుంచి విజ్ఞాపనలు స్వీకరణ.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!









