BREAKING : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా జితేష్ వి.పాటిల్..!
BREAKING : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా జితేష్ వి.పాటిల్..!
భద్రాది కొత్తగూడెం, మనసాక్షి,
భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా ఆదివారం ఉదయం 10 :15 నిమిషాలకు ఐ డి ఓ సి లో తన ఛాంబర్ లో తొలి సంతకం చేసి నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలను జితేష్ వి. పాటిల్ స్వీకరించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు పుష్పగుచ్చం అందించి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ గా పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాల మేరకు అందరినీ సమన్వయం చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
BREAKING : గడచిన ఐదేండ్లు విశృంఖల పాలన.. కొత్త ప్రభుత్వానికి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ..!
Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!
BIG BREAKING : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు.. ధర్మల్ ప్లాంట్స్ పై విచారణ..!









