Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

మాజీ మంత్రి, మేడ్చల్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టిడిపిలోకి వెళ్ళనున్నారా? అనే విషయం తెలంగాణలో ప్రస్తుతం పెద్ద చర్చినీయాంశంగా మారింది. ఆయన బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పటికీ ఇటీవల పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడని ప్రచారం జోరుగా సాగింది. ఆయనతో పాటు ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

కానీ ఆయన మాతృ సంస్థ అయిన టిడిపిలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఈ విషయంపై కేసీఆర్ కూడా మల్లారెడ్డిని అడిగినట్లు తెలిసింది. కాగా మల్లారెడ్డి టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని టిడిపిలోకి వెళ్తే తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవి కూడా మల్లారెడ్డి దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దాంతో టిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ షాక్ గురవుతున్నట్టు సమాచారం.

చంద్రబాబు స్కెచ్ :

తెలంగాణలో టిడిపి అభిమానులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్నారు. టీడీపీ కి పూర్వవైభవం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ లోతమ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేసిన కేసీఆర్ పైనే తన భానం విసిరే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ లో ఉన్న పూర్వ టిడిపి నాయకులంతా తిరిగి టిడిపిలో చేరేందుకు మల్లారెడ్డిని అధ్యక్షుడిగా నియమించి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ లో ఉన్న పూర్వ టిడిపి నాయకులంతా తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం రావడంతో పాటు బీఆర్ఎస్ ఎంతోకొంత ఉన్న నియోజకవర్గాలలో కూడా బలం కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

ALSO READ :

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు అనే నేను..!

Revanth : రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు? ఏఐసీసీ కసరత్తు..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

మరిన్ని వార్తలు