Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Revanth : రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు? ఏఐసీసీ కసరత్తు..!

Revanth : రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు? ఏఐసీసీ కసరత్తు..!

మన సాక్షి ,తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏడు మాసాలు గడుస్తుంది. అధికారంలో ఉన్న సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు సైతం జరిగాయి. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పది నుంచి 12 స్థానాలు కైవసం చేసుకుంటుందని భావించినప్పటికీ 8 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే 6 గ్యారంటీల అమలుకు కసరత్తు నిర్వహించారు. అవి పూర్తిస్థాయిలో అమలు కాకముందే ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయాయి.

ఇప్పుడు మళ్లీ కసరత్తు కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో కూడా ఉన్నారు. ఈనెల 27వ తేదీతో పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి కి మూడేళ్లు ముగియనున్నది. కాగా ముఖ్యమంత్రి పదవి అధ్యక్ష పదవి కూడా ఒక్కరికే కాకుండా పిసిసి అధ్యక్ష పదవిని వేరే వారికి ఇవ్వాలని ఏఐసీసీ కసరత్తు నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నందున పిసిసి అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలని విషయంపై కసరత్తు జరుగుతుంది.

కర్ణాటకలో మాదిరిగా పి పిసిసి అధ్యక్ష పదవి తనకు కేటాయించాలని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరినట్లు సమాచారం. కర్ణాటకలో కూడా ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న డీకే శివకుమార్ అక్కడ రాష్ట్ర పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా తనకు అదేవిధంగా కేటాయించాలని భట్టి కోరారు.

అదేవిధంగా పిసిసి అధ్యక్ష పదవి రేసులో మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తుంది. వారితోపాటు మంత్రి సీతక్క , ఎంపీ బలరాం నాయక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానని పొన్నం ప్రభాకర్ ప్రకటించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా పిసిసి అధ్యక్ష పదవిని భర్తీ చేసిన అనంతరమే మంత్రివర్గ విస్తరణ కూడా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అతి త్వరలో పిసిసి అధ్యక్ష పదవిని భర్తీ చేసే ఆలోచనలో ఏఐసీసీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ :

Telangana : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేఎల్పి నేత ఏలేటి మరో బహిరంగ లేఖ..!

Chandrababu : నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

మరిన్ని వార్తలు