Breaking Newsఉద్యోగంజాతీయం

Forest Jobs : రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.31 వేల వేతనం..!

Forest Jobs : రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.31 వేల వేతనం..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

అటవీ శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి 17 ఫీల్డ్ వర్కర్ ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు కాంట్రాక్టు పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నారు.

అందుకోసం ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి ఉండాలి. 18 నుండి 50 సంవత్సరాల వయసు మధ్యన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చును. రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఈ ఉద్యోగాలు కల్పిస్తారు. నవంబర్ 30 తేదీ లోగా దరఖాస్తులకు చివరి గడువుగా ప్రకటించారు.

అడ్రస్ :

నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్, ప్లేస్మెంట్ సెల్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాను,డెహ్రాడూన్ 248001( ఉత్తరాఖండ్)
ఈ అడ్రస్ కు దరఖాస్తును పంపాలి.

అటవీ శాఖ నుండి సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇండియన్ సిటిజెన్స్ నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

దరఖాస్తుకు కావలసినవి :

అటవీ శాఖలోని ఉద్యోగాలకు దరఖాస్తులకు సంబంధించి ఈ సర్టిఫికెట్లు తప్పనిసరిగా అవసరం ఉన్నాయి. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పిజి మార్క్స్ సర్టిఫికెట్లు ఉండాలి.

కుల దృవీకరణ పత్రం ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరి అయితే 500 రూపాయలు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పిడబ్ల్యుడి అభ్యర్థులకు వంద రూపాయలు ఫీజు ఉంటుంది.

18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సాడలింపు ఉంది.
దరఖాస్తు, ఉద్యోగం ఎంపిక :

దరఖాస్తులు ఆన్‌లైన్ లో కూడా చేసుకోవచ్చును. అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలను కల్పిస్తారు. నెలకు వేతనం 31 వేల రూపాయలను అందజేయడంతో పాటు హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగాల అయినందున ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల దరఖాస్తు చేసుకో వచ్చును.

MOST READ : 

మరిన్ని వార్తలు