Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లారాజకీయం

BSP : బహుజన్ సమాజ్ పార్టీలో చేరికలు..!

BSP : బహుజన్ సమాజ్ పార్టీలో చేరికలు..!

వెంకటాపురం, మన సాక్షి :

వెంకటాపురం మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ వెంకటాపురం మండల అధ్యక్షులు సొల్లేటి గణేష్ చారి ఆధ్వర్యంలో తాటి సంజయ్, వేల్పుల బాబురావులు బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భద్రాచల నియోజకవర్గ అదనపు ఇన్చార్జ్ తడికల శివకుమార్ ముందుగా పార్టీ కండువా కప్పి వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తాటి సంజయ్, బాబురావు పార్టీలో చేరడం యంతో శుభపరిణామమని, పార్టీని పార్టీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీఎస్పీ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలను రాజ్యాధికారానికి తీసుకు వస్తుందని బహుజన రాజ్య స్థాపన కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యం అవ్వాలని బిఎస్పీ ఉద్యమంలోకి వరవడిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు కొండా చరణ్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు వెంకటాపురం మండల ఇన్చార్జి కుమ్మరి రాంబాబు, వెంకటాపురం మండలం పార్టీ అధ్యక్షులు సొల్లేటి గణేష్, ఉపాధ్యక్షులు కంతి నేత్రానంద్, పార్టీ నాయకులు అంగాల సాయి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Holidays : వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు.. వారికి ఇవ్వాల్సిందే..!

  2. SLBC : ఎస్ఎల్బీసి సొరంగం.. ఆనాడే బయటపెట్టిన కేసీఆర్.. (వైరల్ వీడియో)

  3. BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!

మరిన్ని వార్తలు