Holidays : వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు.. వారికి ఇవ్వాల్సిందే..!
Holidays : వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు.. వారికి ఇవ్వాల్సిందే..!
మన సాక్షి, హైదరాబాద్ :
విద్యార్థులు, బోధన సిబ్బందికి శుభవార్త అందింది. ప్రతినెలా నాలుగో శనివారం సెలవు ప్రకటించింది. ఈ విధానం గతంలోనే అమలులో ఉంది. కానీ ఇటీవల అమలు కావడం లేదు. దానిని తిరిగి ప్రవేశపెట్టింది.
జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTU -H) విద్యార్థులు, బోధన సిబ్బందికి శుభవార్త తెలియజేసింది. యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలు, కార్యాలయాలు ప్రతినెలా నాలుగో శనివారం సెలవు దినంగా ప్రకటించబడినాయి.
2008 ముందు ఈ విధానం అమలులో ఉండేది. కాగా మళ్లీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఫిబ్రవరి 22 నుంచి ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న అన్ని సంస్థలు ఈ మార్పును పాటించాల్సి ఉంటుందని యాజమాన్యాలను ఆదేశించింది.
గతంలో ఈ విధానం అమల్లో ఉండగా కొన్ని పరిపాలనా కారణాలవల్ల రద్దు చేసింది. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. జే ఎన్ టి యు రిజిస్టర్ వెంకటేశ్వరరావు ఈమెయిల్ కు అధికారిక ప్రకటన జారీ చేశారు.
ప్రతినెలా నాలుగవ శనివారం అన్ని కళాశాలలు, విద్యాలయాల విభాగాలు, పరిపాలన కార్యాలయాలు మూసి వేయబడతాయి. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అన్ని సంస్థలు ఈ మార్పును పాటించాల్సి ఉంటుందని ఆదేశించారు. విద్యార్థులు మరియు భోదన సిబ్బందికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారింది.
■ MOST READ :
-
!Neha Shetti : నయా ట్రెండ్.. డీజే టిల్లు భామ నేహా శెట్టి సందడి..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Hyderabad : నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన తనయుడు..!
-
SLBC : ఎస్ఎల్బీసి సారంగ ప్రమాదంలో.. 42 మంది సేఫ్.. ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!









