Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనారాయణపేట జిల్లావ్యవసాయం

Seeds : నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ టీం..!

Seeds : నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ టీం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నకిలీ విత్తనాల నియంత్రణపై టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ టీం కలిసి నకిలీ విత్తనాలు నియంత్రణపై చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో డీఎస్పీ లింగయ్య తో కలిసి నకిలీ విత్తనాల విక్రయాలపై ముందస్తు చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏవోలు విత్తన దుకాణాల పై తనిఖీలు నిర్వహించాలన్నారు. సీడ్ డీలర్లు ఎలాంటి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు అమ్మరాదని తెలిపారు. డీలర్లు లూస్ విత్తనాలు, నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఏవోలు వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.

డీఎస్పీ మాట్లాడుతూ ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అమ్మకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మిన సీడ్ వ్యాపారులపై పిడిఎఫ్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. 2024లో నకిలీ విత్తనాల మీద 8 మందిపై పిడిఎఫ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పీడీ యాక్ట్ నమోదు చేస్తే వారు ఒక సంవత్సరం జైలులో శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. సీడ్ డీలర్లు సహకరించి నకిలీ విత్తనాల నిరోధానికి కృషి చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో సీడ్ వ్యాపారులు తమకు సహకరించి నకిలీ విత్తనాలు లేకుండా చూసుకోవాలన్నారు.

ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉన్నట్లు తెలిస్తే తమకు గానీ ఎస్పీకి గానీ సమాచారం ఇస్తే వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో డిఏవో, ఎడిఏ ఎస్ హెచ్ ఓ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!

  2. Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!

  4. WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!

మరిన్ని వార్తలు