SIM Cards New Rules : జస్ట్ వన్ మినిట్.. మీ పేరున ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి ఇలా.. లేదంటే రెండు లక్షల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష..!
SIM Cards New Rules : జస్ట్ వన్ మినిట్.. మీ పేరున ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి ఇలా.. లేదంటే రెండు లక్షల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
మీ పేరున ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో..? మీకు తెలుసా..? గతంలో తీసుకున్న సిమ్ కార్డులు కూడా మీ పేరు మీదనే కొనసాగుతున్నాయా..? లేదా..? అనే విషయం లో అలర్ట్ గా ఉండండి. లేదంటే టెలికమ్యూనికేషన్ యాక్ట్ – 2023 ప్రకారం కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఆ నిబంధనలు అతిక్రమిస్తే 2 లక్షల రూపాయల జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.
టెలికమ్యూనికేషన్ చట్టం – 2023 ప్రకారం ఒక వ్యక్తి వద్ద 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువగా ఉండవద్దు. అయితే మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో..? ఇలా.. తెలుసుకోండి. కొంతమంది అవసరం లేకున్నా.. ఆఫర్లు ఉన్నాయని ఆకర్షితులై సిమ్ కార్డులు ఎక్కువగా కొంటుంటారు. వాటి అవసరం తీరిపోయిన తర్వాత అవి పారేసి మళ్లీ కొత్తవి కొనుక్కుంటారు. ఇలా ఒక్కొక్కరు ఎన్నో సిమ్ కార్డులు ఉపయోగిస్తుంటారు.
కానీ టెలికాం చట్టం – 2023 ప్రకారం కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. జమ్ము కాశ్మీర్, అసోం, నార్త్ ఈస్ట్ లైసెన్స్ సర్వీస్ ఏరియాలో మాత్రమే అయితే ఒక వ్యక్తి పేరున గరిష్టంగా 6 SIM కార్డులే ఉండాలి. ఈ నిబంధనలు 2024 జూన్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒకవేళ పరిమితికి మించి సిమ్ కార్డులు ఉంటే రెండు లక్షల జరిమానా, మూడేళ్ల జరిశిక్ష పడే అవకాశం ఉంది.
మీ పేరున ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి..
- సిమ్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి సంచార్ సాతి వెబ్సైట్ ( sancharsaathi) ద్వారా తెలుసుకోవచ్చును.
- మీరు సంచారసాథి https//:www.sancharsaathi.gov.in అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- వెబ్‌సైట్ ఓపెన్ కాగానే హోమ్ పేజీలో సిటిజన్ సెంటర్ సర్వీస్ Citizen centeric services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అది ఓపెన్ కాగానే నౌ యువర్ మొబైల్ కనెక్షన్స్ know your mobile connections ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి. క్యాప్చ validate captcha వస్తుంది.
- దానిని ఎంటర్ చేయాలి. వ్యాలిడేట్ క్లిక్ చేయాలి. Captcha వ్యాలిడేట్ అవ్వగానే మీ ఫోన్ కు ఓటిపి వస్తుంది.
- ఓటిపిని అక్కడ ఉన్న బాక్స్ లో ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఎన్ని సిమ్ కార్డులు కనెక్షన్లు ఉన్నాయో కనిపిస్తాయి.
- సిమ్ కార్డు పక్కనే నాట్ మై నెంబర్ Not my number, Not required, Required అనే ఈ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి
- మీ పేరుపై ఉన్న యాక్టివ్ సిమ్ కార్డును డిస్కనెక్ట్ చేయడానికి నాట్ మై నెంబర్ Not my number పై క్లిక్ చేయాలి
- అవసరం లేని సిమ్ కార్డును డిస్కనెక్ట్ చేయడానికి నాట్ రిక్వైర్డ్ Not Required క్లిక్ చేయాలి.
- ఒకవేళ మీకు అవసరమైన సిమ్ కార్డులు మాత్రమే ఉంటే రిక్వైర్డ్ Required క్లిక్ చేయాలి. ఒకవేళ Required రిక్వైర్డ్ పై క్లిక్ చేయకున్నా అవసరం లేదు.
ఇవి కూడా చదవండి :
Miryalaguda : నేను, నా మిర్యాలగూడ.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ సరికొత్త స్వచ్ఛంద కార్యక్రమం..!
Power Bill : కరెంటు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. విద్యుత్ బిల్లులపై కీలక అప్ డేట్.!










