Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

Power Bill : కరెంటు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. విద్యుత్ బిల్లులపై కీలక అప్ డేట్.!

Power Bill : కరెంటు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. విద్యుత్ బిల్లులపై కీలక అప్ డేట్.!

మనసాక్షి:

కరెంట్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ ఏంటంటే. ఇకపై విద్యుత్ బిల్లుల విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెల 12 నుంచి 15వ తేదీ వరకు కూడా విద్యుత్ మీటర్ రీడింగ్ లు తీస్తున్నారు. విద్యుత్ అధికారులు ఆలస్యంగా మీటర్ రీడింగ్ తీయడం వల్ల ఎక్కువ బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.

అందుకు విద్యుత్ అధికారులు కూడా ఎప్పుడు మీటర్ రీడింగ్ తీసినా కూడా 30 రోజులకే బిల్లు ఇస్తున్నామని వివరణ కూడా ఇచ్చారు. కానీ విద్యుత్ వినియోగదారులు సంతృప్తి చెందడం లేదు. విద్యుత్ మీటర్ రీడింగ్ లో ఆలస్యం కావడం వల్లనే అధిక బిల్లులు వస్తున్నాయని పేర్కొంటున్న విషయం తెలిసిందే.

అందుకుగాను విద్యుత్ శాఖ కొత్త విధానాన్ని అమలు చేయనున్నది. ఇకపై మీటర్ రీడింగ్ విషయంలో కొత్త పరికరాలతో రీడింగ్ తీయనున్నారు. ఇప్పటికే లైన్ మెన్ లకు కూడా ఈ కొత్త పరికారాలను అందించినట్లు తెలిసింది. దాంతో ఇకపై 5వ తేదీ లోపు మీటర్ రీడింగ్ తీయాల్సి ఉంది. ఒకవేళ తియ్యనట్లయితే 6వ తేదీ ఆటోమేటిక్ గా విద్యుత్ బిల్లు జనరేట్ అవుతుంది.

జూన్ నెల లోనే విద్యుత్ లైన్ మెన్ లకు కొత్త పరికరాలు అందజేశారు. కొన్నిచోట్ల జూలై మాసంలో కూడా 5వ తేదీ లోపే కరెంటు బిల్లులు కూడా సిద్ధమయ్యాయి. ఇకపై వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా లైన్ మెన్ లకు అందజేసిన మీటర్ రీడింగ్ లేటెస్ట్ మిషన్ స్పీడుగా ఉంటుంది. దాంతో మీటర్ రీడింగ్ చూసి వారి వద్ద ఉన్న ప్రింటర్ సహాయంతో బిల్లును అందజేయనున్నారు.

ALSO READ : 

BREAKING : ఇంటింటా ఇన్నోవేటర్, ఆ తేదీలోగా వివరాలు పంపాలి.. జిల్లా కలెక్టర్..!

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

మరిన్ని వార్తలు