Telangana : శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే కేసీఆర్ ను చిత్తుగా ఓడించా.. రేవంత్, మెగా, రాజశేఖర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్..!

శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల తాను కేసీఆర్ ను చిత్తుగా ఓడించాలని కేఏ పాల్ పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి తో పాటు మెగా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచల వ్యాఖ్యలు చేశారు.

Telangana : శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే కేసీఆర్ ను చిత్తుగా ఓడించా.. రేవంత్, మెగా, రాజశేఖర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్..!

పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది .

నల్లగొండ, మన సాక్షి:

శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల తాను కేసీఆర్ ను చిత్తుగా ఓడించాలని కేఏ పాల్ పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి తో పాటు మెగా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచల వ్యాఖ్యలు చేశారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. శనివారం నల్గొండ లోని మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ తరఫున సినీ నటుడు బాబు మోహన్ పోటీ చేస్తున్నారని మిగతా సీట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. రాష్ట్రంలో బిజెపి , బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా భూస్థాపితం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ కూడా భూస్థాపితం అయితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీకి అవకాశం ఇస్తే తిరుగులేని అభివృద్ధి చేస్తామన్నారు.

బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని దేశ సంపదలను అంబానీలకు దోచిపెడుతుందని తీవ్రంగా విమర్శించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి ఫై బిఆరెస్, కాంగ్రెస్ నేతలు అబద్దపు మాటలు చెపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదని రేవంత్ రెడ్డి వచ్చి నన్ను చాలా సార్లు కలిశారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు నీటి సమస్య తీవ్రంగా ఉంది. అని కరెంటు కోత కూడా ఉందని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వాటర్ మినిస్టర్ ను మార్చమని చెప్పాను అని తెలిపారు.

25లక్షల కోట్లు పెద్దలకు దోచి పెట్టారన్నారు.నా మాటలు అన్ని మీడియా సంస్థలు లైవ్ ఇవ్వాలన్నారు.నా మాటలను చూపించక పోతే మీడియా సంస్థలు అన్ని ఇబ్బందులు పడుతాయన్నారు. 330 కోట్ల సెక్రటీరియల్ ఏమైంది , తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కురుకుపోయింది. శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే కెసిఆర్ ను చిత్తు గా ఓడించా.!!. నన్ను చంపించడానికి కెసిఆర్ నాపై మూడు కేసులు వేశాడు. మెగా కృష్ణారెడ్డి నన్ను చంపగలిగాడా.. రాజశేఖర్ రెడ్డి నన్ను చంపాలని ముక్కలు అయిపోయాడు.

మునుగోడు ఎన్నికల్లో ఈవి ఎం ల ట్యాపింగ్ జరిగింది. అవసరమైతే నా స్పిరిట్యువల్ పవర్ వాడుతా.
నేను దేవుని దూతను మీ కోసం వచ్చా.. మీడియా హక్కులను కాపాడుతా.నేను అగ్ర కులంలో పుట్టలేదనా! మా బీసీ లకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడం లేదు. ఏపీ లో రాజకీయ నాయకులందరిని డిస్ క్వాలిపై చేయాలని, ఏపీ లో డ్రగ్ మాఫియా ను ప్రోత్సహిస్తున్న వారి ఫై ఉక్కు పాదం మోపాలన్నారు.

కవిత జైలుకు వెళుతుందని ముందే చెప్పాను.
కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎంత మందిని అరెస్ట్ చేశారని,
వెయ్యి కోట్లకు రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి కి అమ్ముడు పోయారని ఆరోపించారు. ప్రజా శాంతి అభ్యర్థి బాబు మోహన్ ను వరంగల్ లో గెలిపించండన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తున్నారని, నల్గొండ నుండి లోక్ సభ కు ప్రజా శాంతి పార్టీ పోటీలో ఉంటుందన్నారు.