Kakatiya Sculptures : చింతపల్లిలో 800 సంవత్సరాల నాటి కాకతీయుల శిల్పాలు..!
Kakatiya Sculptures : చింతపల్లిలో 800 సంవత్సరాల నాటి కాకతీయుల శిల్పాలు..!
పురావస్తు పరిశోధకుడు శివ నాగిరెడ్డి
చింతపల్లి, మన సాక్షి:
800 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నెలకొల్పిన చారిత్రక శిల్పాలపై రంగులు వేసి ప్రాచీన చరిత్రకు భంగం కలిగించవద్దని పురావస్తు పరిశోధకుడు శివ నాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్ నగర్ గొడకొం డ్ల గ్రామంలో కాకతీయులు నిర్మించిన పురాతన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని ప్లీచ్ ఇండియా సీఈఓ ఈ మని శివ నాగిరెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా వారు దేవాలయాన్ని నడదిక్కుల పర్యవేక్షించి దేవాలయ ప్రాంగణంలో ఉన్న సప్త మాతృక ల శిలాఫలకం రెండు ముక్కలై ఒకటి ప్రాకారం గోడకు బిగించి ఉండగా, రెండవ ముక్క మండప ద్వారానికి ఎడమవైపున బిగించి ఉన్నాయని వాటిని అలాగే వదిలి వేయకుండా పలిగిన శిలాఫలకాలపై నలుపు రంగు వేయడంతో ఆ శిలా పలకపై ఉన్న చరిత్రను చెరిపి వేస్తుందని వారు ఆవేదన వ్యక్తపరిచారు.
విగ్రహాలను పరిశీలించిన శివ నాగిరెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంగిరేకుల గోపాల్ సభ్యులు ఇడు కుల్ల రామ్మోహన్, కడారి జంగయ్య, గ్యార యాదయ్య, తుగిరి వెంకటయ్య వంగూరి శ్యాంసుందర్, అర్చకులు వైద్యుల ప్రవీణ్ శర్మ, బి సత్యనారాయణ రెడ్డి, ల కు చారిత్రక ప్రాధాన్యతను పూర్తిగా వివరించారు. కలిగిన శిలాఫలకంపై వేసిన రంగును వెంటనే తొలగించాలన్నారు.
ALSO READ :
- Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!
- KTR : కారు దిగుతున్న నేతలు.. వారిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!
- KCR : ఫాఫం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నెలల ముచ్చటగా కారు పార్టీ కథ..!
- Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
- Telangana : అయ్యో అన్నదాతా.. అలుముకున్న కరువుఛాయలు…!









