Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

KTR : కారు దిగుతున్న నేతలు.. వారిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

KTR : కారు దిగుతున్న నేతలు.. వారిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన మూడు నెలల్లోనే కనీసం పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కూడా కరువయ్యారు. అంతేకాకుండా పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

దాంతో తెలంగాణలో కారు ఖాళీ కానున్నదని ఊహాగానాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ – బిజెపి మాత్రమే ఉంటుందని నేతల్లో బలంగా నాటుకుపోయింది. దాంతో ఒక్కొక్కరుగా కారు దిగి పోతున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికరంగా తన ఎక్స్ లో ఆసక్తికర ట్వీట్ చేశారు.

ALSO READ : Check Post : వాడపల్లి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన అంతర్ రాష్ట్ర, సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు..!

కేటీఆర్ ట్వీట్ :

శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్

ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్

ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు

ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు

నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం

 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు