Breaking Newsకరీంనగర్క్రైంతెలంగాణ

Karimnagar : సిపి తీవ్ర హెచ్చరిక.. చైనీస్ మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు..!

సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) విక్రయాలు, నిల్వ మరియు వినియోగంపై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.

Karimnagar : సిపి తీవ్ర హెచ్చరిక.. చైనీస్ మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు..!

​కరీంనగర్, మనసాక్షి :

సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) విక్రయాలు, నిల్వ మరియు వినియోగంపై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, పర్యావరణానికి మరియు ప్రాణకోటికి ముప్పుగా మారిన చైనీస్ మాంజాపై పూర్తిస్థాయిలో నిషేధం అమలులో ఉందని స్పష్టం చేశారు.

పదునైన నైలాన్ దారం వల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ముఖ్యంగా పక్షులు, మూగజీవాల ప్రాణాలకు ఇది పెనుముప్పుగా మారిందన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా చైనీస్ మాంజా అమ్మకాలను అరికట్టడానికి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. షాపులు, గోదాములపై నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు.

నిబంధనలను అతిక్రమించి చైనీస్ మాంజాను తయారు చేసినా, విక్రయించినా లేదా నిల్వ ఉంచినా అటువంటి వారిపై చట్టపరంగా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.​పతంగి ఎగురవేసేందుకు కేవలం సాధారణ కాటన్ దారాలను మాత్రమే వాడాలన్నారు. విద్యుత్ లైన్ల దగ్గర, రద్దీగా ఉండే రోడ్ల పైన మరియు జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో పతంగులు ఎగురవేయవద్దని సూచించారు.

మీ పరిసరాల్లో ఎవరైనా చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు. ​వచ్చే సంక్రాంతి పండుగను ఎటువంటి ప్రమాదాలు లేకుండా, సురక్షితంగా జరుపుకోవాలని కమిషనర్ గౌష్ ఆలం ప్రజలకు పిలుపునిచ్చారు.

MOST READ 

  1. Suryapet : మంచినీళ్లు రాక రెండు నెలలు.. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ వద్ద మహిళల నిరసన..!

  2. TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

  3. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా.. అయితే ఇవి పాటించండి..!

  4. District SP : జిల్లా ఎస్పీ కఠిన హెచ్చరిక.. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో కౌన్సిలింగ్..!

మరిన్ని వార్తలు