Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : తీవ్ర విషాదం, కన్న తండ్రి కర్కషం.. కవల పిల్లలను బావిలో పడేసి హత్య..!

ఆ కవల పిల్లలు అంటే ఊరంతా ఇష్టమే. వారి పై గ్రామస్తులే ప్రేమాభిమానాలు పంచేవారు. కానీ కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి మృగంగా మారి.. ఆ పిల్లలను బావిలో పడేసి హత్య చేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

Karimnagar : తీవ్ర విషాదం, కన్న తండ్రి కర్కషం.. కవల పిల్లలను బావిలో పడేసి హత్య..!

మన సాక్షి, కరీంనగర్ :

ఆ కవల పిల్లలు అంటే ఊరంతా ఇష్టమే. వారి పై గ్రామస్తులే ప్రేమాభిమానాలు పంచేవారు. కానీ కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి మృగంగా మారి.. ఆ పిల్లలను బావిలో పడేసి హత్య చేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని జూబ్లీ నగర్ లో వెలుగు చూసిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వివరాల ప్రకారం.. జూబ్లీ నగర్ కు చెందిన శ్రీశైలం తన ఇద్దరు కవల ఆడపిల్లలను వ్యవసాయ బావిలోకి తోసి చంపేశాడు. కుటుంబంలో తలెత్తిన కలహాలే ఆ కవల పిల్లల పాలిట మృత్యు పాషాలయ్యాయి. తన ఇద్దరు ఆడపిల్లలను బావిలో పడేసిన శ్రీశైలం తాను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అయితే అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

బావిలో పడ్డ చిన్నారులువి కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోయాయి. ఈ సంఘటనలో ఒక కూతురు మృతదేహం లభించగా మరో కూతురు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన పట్ల గ్రామస్తులు ఆగ్రహంతో శ్రీశైలంకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు.

కుటుంబ కలహాలే అని ప్రాథమిక విచారణలో తేలింది. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం తన కోపాన్ని తన బిడ్డలపై చూపి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ కవల పిల్లల పట్ల గ్రామస్తులంతా ఎంతో ఇష్టంగా ఉండేవారు. వారు ఇక లేదని తెలిసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమా..? లేక మరేదనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు