క్రైంBreaking Newsతెలంగాణమహబూబ్నగర్
Liquor : కర్ణాటక మద్యం ప్యాకెట్లు.. తెలంగాణలో పట్టివేత..!
Liquor : కర్ణాటక మద్యం ప్యాకెట్లు.. తెలంగాణలో పట్టివేత..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
మహబూబ్ నగర్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఎం. సుధాకర్ ఆదేశాల మేరకు శనివారం మాగనూరు మండలం ఉజ్జల్లి గ్రామంలో ఎక్సైజ్జ్ సీఐ బి. అనంతయ్య, ఎస్సై శిరీష ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉజ్జల్లి గ్రామానికి చెందిన సాకలి భీమేష్ అనే వ్యక్తి ఇంట్లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన టిట్రా(15) మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకొన్నారు.
సాకలి భీమేష్ పై ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం కేసు నమోదు చేసి అట్టి వ్యక్తిని రిమాండ్ కు తరలించినట్లు సిఐ అనంతయ్య తెలిపారు. ఇకముందు ఎవరైనా అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం, గంజాయి, ఏ ఇతర మత్తు పదార్థాలు అక్రమంగా కలిగి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు సురేష్, నరేష్, కృష్ణవేణి, గౌసియా సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!
-
Miryalaguda : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!
-
TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
-
TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!









