Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయంతెలంగాణ

BIG BREAKING : ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్..!

BIG BREAKING : ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్..!

మనసాక్షి , వెబ్ డేస్క్:

లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాప్ తగిలింది. సోమవారం కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. కవితకు మధ్యంతర బెయిల్ పై ఉత్కంఠత వీడింది. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెల్లడించారు.

ఏప్రిల్ 4వ తేదీన కవిత బెయిల్ కొటేషన్ పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పి ఎం ఎల్ ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళగా, ఎమ్మెల్సీగా, ఉన్నందున ముఖ్యంగా తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోరారు. కాగా ఈ బెయిలు ఈడి వ్యతిరేకించింది.

కవిత చిన్న కుమారుడు ఒంటరిగా లేడు.. 22 సంవత్సరాల సోదరుడు, తన కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని, కవితను ఆమె ముగ్గురు సిస్టర్స్ మూలాకత్ అయ్యారు. అబ్బాయిని చూసుకోవడానికి కుటుంబ సభ్యులు ఉన్నారని, పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు. కానీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని ఈడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి.. లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవితనే, కవిత మొబైల్ ఫోన్లను మార్చారు. ఆధారాలు ద్వంసం చేశారు. సమాచారాన్ని కూడా డిలీట్ చేశారు. తొమ్మిది ఫోన్లలో డేటా డిలీట్ చేశారు. మొత్తం పది ఫోను ఫార్మాట్ చేశారు. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై దర్యాప్తు కొనసాగుతుంది.

కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం దర్యాప్తుకు ఆటంకం కలుగుతుంది.. అని న్యాయవాది వెల్లడించారు. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు. దాంతో కవితకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను తిరస్కరించాలని కోర్టుకు న్యాయవాది కోరారు. ఈడి వాదలతో ఎకీభవించిన కోర్టు కవితకు బయలు నిరాకరించింది.

MOST READ : 

మరిన్ని వార్తలు