Liquor : మద్యం సిండికేట్ దందా..!

భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైన్స్ షాపులు సిండికేట్ గా ఏర్పాటయ్యి బెల్టు షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగిస్తున్న పరిస్థితి పాల్వంచ మండల కేంద్రంలో నెలకొంది.

Liquor : మద్యం సిండికేట్ దందా..!

భద్రాద్రి కొత్తగూడెం (పాల్వంచ), మనసాక్షి:

భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైన్స్ షాపులు సిండికేట్ గా ఏర్పాటయ్యి బెల్టు షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగిస్తున్న పరిస్థితి పాల్వంచ మండల కేంద్రంలో నెలకొంది. గతంలో ఉన్న వాటి కంటే రెట్టింపు సంఖ్యలో బెల్టుషాపుల ఏర్పాటుతో వైన్స్ షాపుల యజమానులు జేబులు నింపుకుంటున్నారని మండల ప్రజలు వాపోతున్నారు.

మూడు వైన్ షాపులకు సిండికేట్ గా రెండు మాత్రమే ఏర్పాటయ్యి బెల్టుషాపుల దందాను కొనసాగిస్తూ మద్యం ప్రియుల జేబులను గుళ్ళ చేస్తున్నారని, ఈ రెండు షాపులు మండల కేంద్రంలో ఒకటి, దానికి సమీపంలో కొన్ని వద్ద మరొకటి ఏర్పాటు చేయడం వలన మండలానికి దూరంగా ఉండే గ్రామాల్లోని మద్యం ప్రియులకు బెల్టుషాపులే గతవుతున్నాయి.

దీనితో వారు బెల్టుషాపులను ఆశ్రయించడం వలన బ్రాండ్ ను బట్టి రూ.20 నుండి రూ.30, ఫుల్ బాటిల్ కు రూ. 50 నుండి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అధిక రేటుపై ప్రశ్నిస్తే వైన్ షాప్ యాజమానులు మావద్ద క్వార్టర్ కు రూ.20, వరకు అధికంగా వసూలు చేస్తున్నారని, కావున ధరలు అదేవిధంగా అమ్ముతామని అంటున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు.

ALSO READ : Rice Mill : పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో కూలిన గోడ.. తప్పిన పెను ప్రమాదం..!