తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలురాజకీయం

Khammam : కెసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయలేరు.. ఎమ్మెల్సీ కవిత..!

Khammam : కెసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయలేరు.. ఎమ్మెల్సీ కవిత..!

ఖమ్మం బ్యూరో, మనసాక్షి:

అక్రమ కేసులకు తలోగ్గేది లేదని ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ సర్కార్ ను ఎండ గడుతూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ ను ఖమ్మం జైల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏ కారణం లేకుండా బిఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

కెసిఆర్ సైన్యాన్ని కట్టని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని కానీ కెసిఆర్ ను ఆయన సైన్యాన్ని కట్టడి చేయటం ఎవరికి సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా మమ్మల్ని ఆపలేరని తేల్చి ప్రభుత్వ వైఫల్యాన్ని మోసాలని ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయని రైతులు విద్యార్థులు మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయని అన్నారు.

14 నెలల పాలనలో రాష్ట్రానికి వరక పెట్టిందేమీ లేదని అందరికీ తెలిసిపోయిందని ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆరోపించారు.ఈ విలేకరుల సమావేశంలో ఎంపీ రవిచంద్ర బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : రాహుల్ గాంధీ కులం పై చర్చ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్.. (వీడియో)

  2. పుష్పయాగంతో శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి..!

  3. Miryalaguda : యూరియా నిల్వలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి.. రైతులకు కీలక సూచన..!

  4. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏడీఈ..! 

మరిన్ని వార్తలు