Telangana : తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడేది కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెగించి కొట్లాడేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమేనని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.

Telangana : తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడేది కేసీఆర్..!

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెగించి కొట్లాడేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమేనని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.

గురువారం షాద్ నగర్ మున్సిపాలిటీ లోని 3,4,21 వార్డులలో మాజీ కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ లాంటి నాయకత్వం ఎంతో అవసరమని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.