Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!
Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై మంత్రివర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సందర్భంగానే పాత రేషన్ కార్డులలో అనర్హులైన తొలగించాలని నిర్ణయించింది.
కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర రూపాయలు, మాగాణి 3. 20 ఎకరాలు, మెట్ట 7. 20 ఎకరాలుగా నిర్ణయించారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రెండు లక్షలుగా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అర్హులు అయిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.
ఇదిలా ఉండగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సందర్భంగా పాత కార్డు దారులలో అనర్హులు ఉంటే తొలగించనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో స్థిరపడిన వారికి రెండు చోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లయితే వాటిని తొలగించానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అనేకమంది వచ్చి ఉన్నారు. వారికి ఆయా రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం జారీచేసిన రేషన్ కార్డులు ఉన్నాయి. వాటితో పాటు తెలంగాణలో కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. అలాంటి వారిని ఏరివేసి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ALSO READ :
Runamafi : రుణమాఫీ అయినా.. ఆ డబ్బులు చెల్లించాల్సిందే, బ్యాంకులకు వెళ్తే అసలు విషయం..!
Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!
Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!
Cm Revanth Reddy : బతుకమ్మకు బహుమతి.. చీరలు బంద్..!
Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)









