District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఆసుపత్రి, సదరం క్యాంపు ఆకస్మిక తనిఖీ..!
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఆసుపత్రి, సదరం క్యాంపు ఆకస్మిక తనిఖీ..!
సూర్యాపేట, జూన్ 20, మనసాక్షి:
సాధారణ ప్రసవాలు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సూర్యాపేట పట్టణం లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సదరం క్యాంపు నిర్వహించేటప్పుడు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పించి సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ప్రతి రోజు వచ్చె పెషంట్ల వివరాలు, జ్వరం తో హాస్పిటల్ కు వచ్చే వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దంగా ఉండాలన్నారు, హస్పటల్ కు వచ్చె వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకి అవగాహన కల్పించాలని సూచించారు.
తదుపరి నిర్మాణంలో ఉన్న ఎం సి హెచ్ సెంటర్ భవనాన్ని సందర్శించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. డి అడిక్షన్ సెంటర్ కోసం స్థలం సేకరించాలని సూచించారు. అత్యవసర వార్డు, TB యూనిట్ వార్డు, జెరియాట్రిక్ కేర్ వార్డు, డే కేర్
కిమోథెరపీ వార్డు, జ్వరం మరియు కోవిడ్ ఐసోలేషన్ వార్డులు కలెక్టర్ పరిశీలించారు.
వైద్యసేవలు,మందులు ఇస్తున్నారా లేదా పేషంట్లను అడిగి తేలుసు కోన్నారు. ప్రతి రోజు బ్లడ్ టెస్టుల వివరాలు, రిజిస్టర్లలో నమోదు పరిశీలించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో మందుల లభ్యత గురించి ఆరా తీశారు.
అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. హాస్పిటల్ లో పారిశుద్యం పనులు ఎప్పటికికప్పుడు చేస్తూ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరిటీడెంట్ సత్యనారాయణ, ఆర్ యం ఓ డాక్టర్ వినయ్ ఆనంద్, డాక్టర్ లక్ష్మణ్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా నిధులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో 36వేలు.. 4 రోజుల్లో క్లోజ్..!
-
Kalpataru: ఐపీవోకు మరో కంపెనీ.. రూ.1,590 కోట్లతో త్వరలో..!
-
District collector : రైతు భరోసా దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు.. రూ.516 కోట్లు రైతుల ఖాతాలో జమ..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి కూడా.. ఖాతాలలో జమ.. చెక్ చేసుకోండి..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడలేదా.. నో టెన్షన్.. ఇలా చేయండి..!









