District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. విద్యార్థులకు వాటి పట్ల పూర్తి అవగాహన కల్పించాలి..!
District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. విద్యార్థులకు వాటి పట్ల పూర్తి అవగాహన కల్పించాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, మాదకద్ర వ్యాల వల్ల కలిగే అనర్ధాలపై జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపుకలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.
జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాoటీ డ్రగ్ కమిటీల ద్వారా మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఉన్నత పాఠశాలలోనూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
డి.ఎస్.పి నల్లపు లింగయ్య మాట్లాడుతూ జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాoటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటీవలే నషా ముక్త్ భారత్ లో భాగంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల గురించి అదనపు కలెక్టర్ కు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిషేధం పై విద్యార్థులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
గతంతో పోలిస్తే డ్రగ్స్ కేసులు చాలా తక్కువ అయ్యాయని ఆయన తెలిపారు. టాస్స్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ పై క్షేత్రస్థాయిలో నిఘా పెట్టడం జరిగిందని డిఎస్పీ వివరించారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఆబ్కారీ శాఖ, విద్యాశాఖ, ఆర్టీవో, ఆర్టీసీ, అటవీ శాఖ అధికారులు కూడా మాదకద్రవ్యాల నిషేధంపై కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారి నేతత్వంలోనూ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఇటీవల కళాశాలలో కొత్తగా విద్యార్థులు చేరారని, ఈ రెండు, మూడు రోజులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారి సుదర్శన్ తెలిపారు.
జిల్లా వైద్యశాఖ అధికారులు సైతం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల నెలవారి సమావేశాలలో డ్రగ్స్ నిషేధం గురించి తెలిపి క్షేత్రస్థాయిలో వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన డీపీఓ బిక్షపతి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాఖల వారీగా అధికారులు డ్రగ్స్ నిషేధం పై ఒక టార్గెట్ ను నిర్దేశించుకుని పని చేయాలని ఆయన సూచించారు. వచ్చే సమావేశానికి ఆర్టీసీ డి ఎం కూడా హాజరు అయ్యేటట్టు చూడాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీవో మేఘా గాంధీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, ఎక్సైజ్ శాఖ అధికారులు, సి సెక్షన్ అధికారినిలు పాల్గొన్నారు. అనంతరం వీసీ హాల్ లో డీ ఎల్ ఎస్ ఏ సమావేశం నిర్వహించగా అదనపు కలెక్టర్ కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో తహసీల్దార్లు పాటించాల్సిన నిబంధనల గురించి తెలిపారు.
MOST READ :
-
Nalgonda : మత్స్య కార్మికులకు తీవ్ర హెచ్చరిక.. రెండు నెలల పాటు నిషేధం..!
-
Suryapet : పథకం ప్రకారం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పోలీసులు అదుపులో కొడుకు..!
-
KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!
-
Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!









