District Sp : జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!

District Sp : జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!
కొల్చారం, మన సాక్షి
సాయంత్రం వాహనాల తనిఖీలు తప్పనిసరి.
ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. కొల్చారం పోలీస్ స్టేషన్ను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
మొదటగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ ఆవరణ పరిశుభ్రతపై సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీసీ కెమెరాల పనితీరు గురించి కూడా ఎస్‌హెచ్‌ఓ నుండి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజూ సాయంత్రం వాహనాల తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వాహణలో అంకితభావంతో పని చేయాలని, ఎవరికైతే ఏ విధులు కేటాయించబడతాయో వాటిని సమయానికి పూర్తి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. సిబ్బంది యొక్క పిల్లల చదువులను అడిగి తెలుసుకున్నారు.విధుల పరంగా ఎలాంటి సమస్య ఉన్నా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు.
రానున్న ఎన్నికల సమయంలో పూర్తిస్థాయి సంసిద్ధతతో ఉండాలని, మండలాలు మరియు గ్రామాలను సందర్శిస్తూ విపిఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
గ్రామాల్లో జరిగే ఆసాంఘిక కార్యకలాపాలు, సామాజిక విఘాతం కలిగించే అంశాలపై సమగ్ర సమాచారం రాబట్టేందుకు పటిష్టమైన సమాచార వ్యవస్థను నిర్మించుకోవాలని సిబ్బందికి సూచించారు.గ్రామాల్లో ప్రజలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్, చైల్డ్ మ్యారేజ్, వుమెన్ హరాస్మెంట్ వంటి సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో రూరల్ సీఐ జర్జ్, కొల్చారం ఎసై అహ్మద్ మోహినొద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
District Sp : మల్లన్న జాతర భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ..!
-
Miryalaguda : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మిర్యాలగూడ నియోజకవర్గం గ్రామాల వారీగా వివరాలు ఇవీ..!
-
Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!
-
Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!









