District collector : జిల్లా కలెక్టర్ మిల్లర్లకు కీలక ఆదేశాలు.. ధాన్యo దిగుమతి వేగవంతం చేయాలి..!
District collector : జిల్లా కలెక్టర్ మిల్లర్లకు కీలక ఆదేశాలు.. ధాన్యo దిగుమతి వేగవంతం చేయాలి..!
పెన్ పహాడ్, మన సాక్షి:
మిల్లులో ధాన్యాన్ని దిగుమతిని వేగవంతం పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినారు. పెన్ పహాడ్ మండలం కేంద్రంలో మంగళవారం శ్రీ వెంకట సాయి రైస్ మిల్ తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యం 25 లారీలు దిగుమతి కాకుండా ఉండడం వలన సాయంత్రం వరకు పూర్తిస్థాయిలో ధాన్యం లారీలను దిగుమతి చేయాలని మిల్లు యజమానికి ఆదేశాలు ఇచ్చినారు.
మిల్లు యొక్క కెపాసిట్ను డిఎం ప్రసాద్ ను వివరణ కోరగా మండలంలో ఐకెపి పిఎసిఎస్ కేంద్రాలలో మిగిలి ఉన్న ధాన్యాన్ని శ్రీ వెంకట సాయి మిల్లుకు పంపవచ్చు అని తెలుపగా మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మిగిలిన ధాన్యం మొత్తాని శ్రీ వెంకట సాయి రైస్ మిల్లుకు టాగ్గింగ్ చేయించి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెండు మూడు రోజులలో పూర్తి చేయాలని సూచించినారు. ఈ కార్యక్రమములో డియం ప్రసాద్, తహశీల్దార్ లాలు నాయక్, ఎపియం అజయ్ నాయక్ పాల్గొన్నారు.
MOST READ :









