క్రైంBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Khammam : విషాద ఘటన.. ఆడుకుంటూ వెళ్లి సాంబారులో పడి చిన్నారి మృతి..!

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ఓ చిన్నారి సాంబారులో పడి మృతి చెందింది.

Khammam : విషాద ఘటన.. ఆడుకుంటూ వెళ్లి సాంబారులో పడి చిన్నారి మృతి..!

మన సాక్షి, ఖమ్మం :

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ఓ చిన్నారి సాంబారులో పడి మృతి చెందింది. వివరాల ప్రకారం.. ఇందిరమ్మ కాలనీలో సింహాద్రి, సరోజిని దంపతుల చిన్న కుమార్తె రమ్యశ్రీ (6) ఆడుకుంటుండగా వేడి సాంబారులో పడి మృతి చెందింది.

తీవ్రంగా కాలిన గాయాలతో ఆహాకారాలు చేస్తున్న చిన్నారిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యులు పరిశీలించి పరిస్థితి విషమంగా ఉందని చిన్నారిని హైదరాబాద్ తరలించాలని చెప్పారు. మార్గ మధ్యలో చిన్నారి కన్ను మూసింది. ఈ ఘటనతో ఇందిరమ్మ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

MOST READ NEWS 

  1. TG News : మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్.. వారు BRS లోనే ఉన్నారు..!

  2. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!

  3. TG News : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో నూతన పథకం ప్రారంభం..!

  4. TG News : మున్సిపల్ ఎన్నికల ముహూర్తం ఫిక్స్.. రిజర్వేషన్లు ఖరారు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల..!

మరిన్ని వార్తలు