కింగ్ అదుర్స్.. మంత్రి కొండ సురేఖకు కోర్టు నోటీసులు..!
కింగ్ అదుర్స్.. మంత్రి కొండ సురేఖకు కోర్టు నోటీసులు..!
మన సాక్షి :
కింగ్ అక్కినేని నాగార్జున అదుర్స్ అనిపించాడు. తెలంగాణ మంత్రి కొండ సురేఖకు నాంపల్లి కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. మంత్రి కొండ సురేఖ పై అక్కినేని నాగార్జున 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే అక్కినేని నాగార్జున వాంగ్మూలం కోర్టు తీసుకుంది. మంత్రి కొండ సురేఖ మాట్లాడిన విషయంపై సుప్రియ మొదటి సాక్షిగా ఉన్నారు. ఆమె వాంగ్మూలాన్ని కూడా కోర్టు తీసుకుంది. అదేవిధంగా గురువారం రెండో సాక్షి వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు.
వాంగ్మూలాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కొండ సురేఖకు తాజాగా నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు నోటీసుల ప్రకారం కొండ సురేఖ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని సమాచారం. ఒకవేళ కోర్టుకు హాజరు కాకుంటే వేరే చర్యలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తదుపరి విచారణకు ఈనెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగా కొండ సురేఖ పై కేటీఆర్ సైతం పరువు నష్టం పిటిషన్ దాఖలు వేశారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొండ సురేఖ వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా చేశారని, కేవలం తన గౌరవాన్ని భంగం కలిగించే లక్ష్యంగా అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
కేటీఆర్ తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ ను కేటీఆర్ సాక్షులుగా పేర్కొన్నారు.
LATEST UPDATE :









