Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది..!
Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది..!
రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి.
భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసిన రఘువీర్రెడ్డి.
నల్లగొండ, మన సాక్షి.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అర్హత ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు . ఉత్తమ వ్యాఖ్యలకు స్పందిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు ముఖ్యమంత్రి కావాలని ఆశ లేదని ఉత్తంకుమార్ రెడ్డి తన మీద అభిమానంతో అలా మాట్లాడారని తాను 11 రోజులు దీక్ష చేసి తెలంగాణ సాధించానని అన్నారు.
నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి ముందుగా పట్టణంలోని వీటి కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని ప్రసంగించారు.
అనంతరం కలెక్టరేట్ వెళ్లి నామినేషన్ అందజేశారు.నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, సిపిఎం నాయకురాలు మల్లు లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు :
Jai Congress : జై కాంగ్రెస్ అంటున్న మిర్యాలగూడ బీఆర్ఎస్ నేతలు.. ముఖ్య నేతల చేరికకు ముహూర్తం ఫిక్స్.!
Telangana : మిర్యాలగూడ నుంచే కేసీఆర్ రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!
Revanth Reddy : ఇక లెక్క పెట్టుకో.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్..!











