Telangana : కెసిఆర్ , కేటీఆర్, జగదీశ్ రెడ్డి పై మిర్యాలగూడ సభలో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!
Telangana : కెసిఆర్ , కేటీఆర్, జగదీశ్ రెడ్డి పై మిర్యాలగూడ సభలో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!
మిర్యాలగూడ , మన సాక్షి :
దక్షిణ భారతదేశంలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా రఘువీర్ రెడ్డిని గెలిపించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేశంలో ఇండియా గెలవ పోతుందని రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని అన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తానన్నారు. చేసేది చెప్తామని కెసిఆర్ లాగా దొంగ మాటలు చెప్పమన్నాను. మూడు ఫీట్లు ఉన్న వ్యక్తి, 3 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిండని, నల్గొండ జిల్లాకు ఐదు పైసలు పనిచేయని ఆయన మా మీద మాట్లాడుతున్నారని అయ్యారు.
కెసిఆర్ , కేటీఆర్ లు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కెసిఆర్ కూతురు జైలు పోయిందని, మతిభ్రమించి రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి పైన పడుతున్నారని అన్నారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రవి చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. కవిత జైలుకు వెళ్లి తెలంగాణ ప్రజల పరువు తీసింది అన్నారు. బిజెపి ఇక్కడ లేదు. బీఆర్ఎస్ నాయకులు పారిపోయారు. ఉన్నది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ.. మెజారిటీతో గెలిపించాలని అన్నారు.
నీటిపారుదల, రోడ్డు భవనాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి ,, మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి , నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి , మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి , నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ మిర్యాలగూడ భారతి రాగ్యా నాయక్ , నియోజకవర్గం నాయకులు స్కైలాబ్ నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి , నూకల వేణుగోపాల్ రెడ్డి , తమ్ముడ బోయిన అర్జున్, పగిడి రామలింగయ్య , ముదిరెడ్డి నర్సిరెడ్డి, చిలుకూరు బాలు, శాగా జలంధర్ రెడ్డి , రుణాల్ రెడ్డి , దేశిడి శేఖర్ రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, మహబూబ అలీ తదితరులు పాల్గొన్నారు.









