క్షుద్ర పూజల కలకలం

 క్షుద్ర పూజల కలకలం

చెన్నూరు (జైపూర్) జనవరి 18 మన సాక్షి

ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామం కొమ్ముగూడెం లో అల్లూరి రామయ్య బానక్క దంపతుల ఇంటిముందు రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు.

తెల్లవారుజామున కుటుంబ సభ్యులు లేచేసరికి ఇంటి ముందు కుంకుమ పసుపు కోడిగుడ్లు కొబ్బరికాయలతో క్షుద్ర పూజలు చేసినట్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కక్ష సాధింపు కొరకు ఇలా చేశారని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కోరారు.