Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజన్న సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల : డాక్టర్ కాలేదు, ఐఏఎస్ కాలేదు, వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

సిరిసిల్ల : డాక్టర్ కాలేదు, ఐఏఎస్ కాలేదు, వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

డాక్టర్ కాలేదు, ఐఏఎస్ కాలేదు రాజకీయ నాయకుడినయ్యా

నేను కూడా బైపీసి స్టూడెంట్ నే

రాజన్న సిరిసిల్ల ప్రతినిథి, మన సాక్షి:

అటు అమ్మ కోరికను, ఇటు నాన్న కోరికను తీర్చలేకపోయానని చివరికి రాజకీయ నాయకుడినయ్యానని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏటా 10వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. నేను కూడా బైపీసీ విద్యార్థినే. మా నాన్న నన్ను ఐఏఎస్ చేయాలని అనుకునేవారు.

మా అమ్మకు నన్ను డాక్టర్ చేయాలన్న కోరిక ఉండేది. ఎంసెట్ లో 1600 ర్యాంక్ సాధించినా ఎంబీబీఎస్ సీటు రాలేదు. ఇప్పుడు అటు ఇటు కాకుండా రాజకీయ నాయకుడినయ్యాను. నేను 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం గొడవ జరిగింది.

ALSO READ :

  1. WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!

డిగ్రీ కాలేజీ సిరిసిల్ల, వేములవాడలో పెట్టాలని గొడవ జరిగి అటుఇటు కాకుండా మధ్యలో పెట్టారు. అలాంటిది నేడు సిరిసిల్లకు జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ వచ్చాయి. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది. పేదలకు సేవ చేసేందుకు మంచి శిక్షణ పొందండి.

ఆపదలో వచ్చే వాళ్లు అటు దేవుణ్ణి ఇటు వైద్యులైన మిమ్మల్నే వేడుకుంటారు.” అంటూ వైద్య విద్యార్థులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్,

ALSO READ :

  1. TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!

టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్,అదనపు కలెక్టర్ లు ఎన్ భీమా నాయక్, గౌతమ్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :

  1. Vinayaka Statues : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు మించి ఆకర్షవంతంగా.. మట్టి వినాయక విగ్రహాలు తయారీ..!
  2. Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!

మరిన్ని వార్తలు