Leopard : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత.. ప్రాణాలతో కాపాడేందుకు అధికారుల ప్రయత్నం..!
Leopard : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత.. ప్రాణాలతో కాపాడేందుకు అధికారుల ప్రయత్నం..!
రామసముద్రం, మనసాక్షి
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని పొన్నేటి పాలెం వద్ద వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుతను కాపాడేందుకు అన్నమయ్య జిల్లా నుంచి ఉన్నతాధికారులు ఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. చిరుతను కాపాడేందుకు అటవీ, రెవిన్యూ,, పోలీస్, వెటర్నరీ అధికారులు సన్నద్ధ మయ్యారు. అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం, పొన్నూటిపాలెం వద్ద వన్య ప్రాణులను వేటాడేందుకు అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుతపులి చిక్కుకున్న విషయం తెలిసిందే.
ఉదయం 8.30కు గమనించిన స్థానిక రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనస్థలం వద్దకు చేరుకున్నారు. మత్తుఇచ్చేందుకు గన్ను, వల, బోను ను సమకూర్చుకున్నారు.
అన్నమయ్య జిల్లా సబ్ డి ఎఫ్ శ్రీనివాసులు, ఫారెస్ట్ రేంజ్ అధికారి జయప్రదరావు, డిఆర్ఓ మదన్మోహన్, ఎఫ్ ఎస్ ఓ సుధాకర్, తదితర అటువైశాఖ అధికారులతో పాటు పోలీస్, రెవెన్యూ, పశు సంవర్తక శాఖ అధికారులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని చిరుతను ప్రాణాలతో కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు
MOST READ :
-
Miryalaguda : రైతుపై దాడి చేసిన రైస్ మిల్లర్లు.. ఆసుపత్రిలో రైతును పరామర్శించిన ఎమ్మెల్యే..!
-
ACB : రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తిమింగలం..!
-
Gold Price : రెండోరోజు వరుసగా మళ్ళీ తగ్గిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Zettai: జెట్టై పునర్నిర్మాణ పథకానికి రుణదాతల గట్టి మద్దతు.. 93.1% అనుకూలం..!
-
Viral Video : హైదరాబాదులో ఎండల తీవ్రతకు బైక్ దగ్ధం.. (వీడియో)









