TG News : గ్రామ సభల్లో చదివే జాబితా.. తుది జాబితా కాదు..!
TG News : గ్రామ సభల్లో చదివే జాబితా.. తుది జాబితా కాదు..!
సూర్యాపేట, మనసాక్షి :
పట్టణ, గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని… ఈ నెల 26 నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాలేదని ఎవరూ అందోళన చెందాల్సిన పని లేదని జాబితాలో పేరు ఉంటే ఉన్నట్లు. లేకపోతే రానట్లు కాదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయా పట్టణం, గ్రామాల్లో జరుగుతున్న సభలను ఉద్దేశించి దామోదర్ రెడ్డి మాట్లాడారు.
పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇలా ఏ పధకం అయినా అర్హత ఉన్న వారికే అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జరిగే గ్రామ సభల్లో ప్రకటించే జాబితాలో అర్హత ఉండి పేరు రాకపోతే ఆ గ్రామ సభల్లోనే మళ్ళీ దరఖాస్తు ఫారం పైన దరఖాస్తులు రాసి ఇచ్చినా వాటి ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు.
సూర్యాపేట నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర అంతా ఇదే పద్ధతి అవలంభించడం జరుగుతుందని తెలిపారు. జాబితాలను ప్రకటించే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లిన మాటలు వాస్తవమేనని వాటిని సవరించేందుకే మళ్ళీ పట్టణ, గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఇది నిరంతర ప్రక్రియ అని విడతల వారీగా ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేదవానికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షం కావాలనే అనవసర రాద్దాంతాలు సృష్టించుతుందని పేర్కొన్నారు. పేదవాడికి మంచి చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం తగదన్నారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఒక పేదవాడికి కూడా న్యాయం చేయలేకపోయిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతుందన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Runamafi : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీ పై పొన్నం కీలక ప్రకటన..!









